Sree Leela : శ్రీ‌లీల చాలా ఖ‌రీదు అయిందిగా.. అమ్మ‌డి మెయింటెనెన్స్ మామూలుగా లేదు..

September 17, 2022 6:55 PM

Sree Leela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ మూవీ పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో శ్రీలీల‌ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అర‌డ‌జ‌నుకు పైగానే సినిమాలున్నాయి. బాల‌య్య, అనిల్ రావిపూడి సినిమాలో ఆమె బాల‌య్య కూతురుగా నటిస్తోంది.

ర‌వితేజ ధ‌మాకాలోనూ ఆమె అందాల‌తో కట్టిప‌డేయ‌బోతోంద‌ని టీజ‌ర్ చూస్తే అర్థమవుతుంది. ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ నిర్మాణంలో మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టించే సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్‌. ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే శ్రీలీల‌కు ఇక్క‌డ షూటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో రూం ఏర్పాటు చేశారు. శ్రీలీల‌తోపాటు ఆమె త‌ల్లి కూడా ఇక్క‌డే ఉంటుంద‌ట‌. అయితే ఈ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ఖ‌ర్చులు అన్ని క‌లుపుకుంటే రోజుకు రూ. 22 వేలు దాకా అవుతుంద‌ని తెలుస్తోంది.

Sree Leela reportedly getting more remuneration and expenses for one film
Sree Leela

షూటింగ్ దాదాపుగా 25 రోజుల పైనే జ‌రుగుతుంద‌ట‌. ఆమెకు ఇచ్చే రెమ్యూనరేషన్ కాకుండా ఇది నిర్మాత‌లు భ‌రించాల్సిందే అట‌. ఈ షెడ్యూల్‌తోనే ఆమె హోట‌ల్ ఖ‌ర్చు రూ.7 నుంచి రూ.8 ల‌క్ష‌లు అవుతోంది. ఆ త‌ర్వాత మ‌రో 20 రోజుల షెడ్యూల్ కూడా ఉంద‌ట‌. అప్పుడు కూడా ఆమెకే రూ. 10 ల‌క్ష‌లు పైనే ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా పెళ్లిసంద‌డి సినిమాకు ముందు వ‌ర‌కు శ్రీలీల షూటింగ్‌కి వస్తే మామూలు హోట‌ల్లోనే ఉండేద‌ట‌. ఎప్పుడు అయితే రేంజ్ పెరిగి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయో.. ఆమె మ‌రింత కాస్ట్లీ అయిపోయింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now