వార్తలు
పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ చేయించుకోనున్న గ్లోబల్ స్టార్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ ఎట్టకేలకు పాన్ ఇండియా వైడ్‌గా విడుదలవుతుండడంతో ఇప్పుడు ఈ సినిమాపై అందరి ఆసక్తి నెలకొంది. అయితే పెద్ది చిత్ర షూటింగ్ సమయంలో చరణ్ చేతికి ఏర్పడిన గాయం కారణంగా ఆయన త్వరలో సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు!
మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ మాఫియా భారీ స్థాయిలో పెరిగిపోతూ సెలబ్రిటీలపై అసత్య ప్రచారాలు చేస్తూ డబ్బులు ఆర్జిస్తోంది.
సీఎస్‌కేకు కొత్త కోచ్ అవసరం లేదు.. ధోనీ ఉన్నాడుగా: అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర నిరాశకు గురైన తర్వాత జట్టు భవిష్యత్తుపై చర్చలు జోరందుకున్నాయి. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఎనిమిది పరాజయాలతో ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది.
సినిమాల్లోకి అనుకోకుండా వచ్చా.. బాక్సాఫీస్ లెక్కలతో పనిలేదు: కింగ్ నాగార్జున ఓపెన్ కామెంట్స్!
తాను సినిమాల్లోకి కావాలని రాలేదని, యాదృచ్ఛికంగానే జరిగిందని, అయినప్పటికీ ప్రేక్షకులు తనను ఆదరించారని, ఆ క్రమంలోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని నటుడు నాగార్జున అన్నారు.
‘పెద్ది’ నా కెరీర్‌లోనే నంబర్ 1 సినిమాగా నిలుస్తుంది: రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్!
బుచ్చిబాబు దర్శకత్వంలో తాను చేసిన పెద్ది మూవీపై ఎంతో మనసు పెట్టి చేశానని, ఈ సినిమా తన కెరీర్ లో ఎప్పటికీ నంబర్ 1 గా నిలుస్తుందని నటుడు రామ్ చరణ్ అన్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చరణ్ కలసి నటిస్తున్న పెద్ది మూవీ జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ క్లైమాక్స్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆసక్తికర వ్యాఖ్యలు!
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చి బాబు సానా తాజాగా గ్రేట్ ఆంధ్రా కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సిరాశ్రీతో జరిగిన ఈ సంభాషణలో పెద్ది క్లైమాక్స్‌పై వచ్చిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
టాలీవుడ్‌లో ఫస్ట్.. రూ. 2.7 కోట్ల ఖరీదైన పోర్షే కారు కొన్న నటుడు నరేష్!
నటనలోనే కాదు, లగ్జరీ లైఫ్ స్టైల్‌ను అనుభవించడంలోనూ ఎంతో పేరుగాంచిన నటుడు నరేష్ తాజాగా మరో పవర్‌ఫుల్ కారును తన గ్యారేజీ కలెక్షన్‌లో చేర్చారు. లుగానో బ్లూ కలర్‌లోని పోర్షె పనమెరా జి3 టర్బో కారును ఆయన కొనుగోలు చేశారు. హైదరాబాద్ రోడ్లపై ఈ కారు ప్రస్తుతం సందడి చేస్తుండగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కారును సొంతం చేసుకున్న తొలి నటుడిగా ఆయన నిలిచారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు దిల్ రాజు గుడ్ న్యూస్.. పర్సెంటేజ్ సిస్టమ్‌పై కీలక నిర్ణయం!
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ సిస్టమ్ అమలుపై ఎగ్జిబిటర్ల డిమాండ్‌కు సానుకూల స్పందన లభించిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు శుక్రవారం (మే 15, 2026) హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
రోహిత్ శర్మ ఎవరో తెలియదు.. విదేశీయుల షాకింగ్ రియాక్షన్! ధర్మశాలలో ‘హిట్ మ్యాన్’ వీడియో వైరల్..
ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ శర్మ ధర్మశాలలో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ కోసం ధర్మశాలకు చేరుకుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ ఒక రెస్టారెంట్‌కు వెళ్తుండగా అభిమానులు భారీగా చుట్టుముట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.













