సోమవారం, జూలై 6, 2026
వినోదం

‘లెనిన్’కు ఎన్టీఆర్ సపోర్ట్.. అఖిల్ సినిమాకు స్పెషల్ వాయిస్ ఓవర్..

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాకు స్టార్ హీరో ఎన్టీఆర్ మద్దతు ప్రకటించారు. ఈ సినిమా ప్రారంభ భాగానికి ఎన్టీఆర్ తన గంభీరమైన వాయిస్‌ను అందించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

‘లెనిన్’కు ఎన్టీఆర్ సపోర్ట్.. అఖిల్ సినిమాకు స్పెషల్ వాయిస్ ఓవర్..
వాయిస్ ఓవ‌ర్ సంద‌ర్భంగా క‌ల‌సిన జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, అఖిల్ అక్కినేని Photo Credit: Lenin Movie/X.

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాకు స్టార్ హీరో ఎన్టీఆర్ మద్దతు ప్రకటించారు. ఈ సినిమా ప్రారంభ భాగానికి ఎన్టీఆర్ తన గంభీరమైన వాయిస్‌ను అందించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కథకు నేపథ్యంగా ఉండే శ్రీరామపురం, భారతం మిట్ట ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రత్యేక వాయిస్ ఓవర్‌ను ఎన్టీఆర్ రికార్డ్ చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నమ్మకంతో పుట్టిన ఒక ప్రపంచం, ప్రత్యేక పరిచయం అవసరం లేని ఒక గొంతు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంద‌ని తెలిపారు. లెనిన్ ప్రారంభంలో శ్రీరామపురం, భారతం మిట్ట ప్రపంచాలను పరిచయం చేస్తూ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ తన వాయిస్‌ను అందించార‌ని పేర్కొన్నారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఎన్టీఆర్ వాయిస్‌..

ఎన్టీఆర్‌కు అక్కినేని కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహిత అనుబంధం ఉంది. చిత్ర బృందం కోరగానే ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడానికి ఆయన వెంటనే అంగీకరించి వాయిస్ ఓవర్ అందించినట్లు సమాచారం. తన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, గంభీరమైన గొంతుతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గతంలో కూడా పలు చిత్రాలకు వాయిస్ ఓవర్లు అందించారు. ఇప్పుడు లెనిన్ కు ఆయన వాయిస్ మరో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

విడుద‌ల ఎప్పుడు..

సినిమాకు సంబంధించిన కొన్ని భాగాలను కూడా ఎన్టీఆర్ వీక్షించినట్లు సమాచారం. సినిమా కోసం అఖిల్ అక్కినేని చూపించిన నిబద్ధత, నిజాయితీతో చేసిన కృషిని ఆయన ప్రశంసించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్నారు. లెనిన్ చిత్రం జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి