వినోదం

Actor Ram Charan with a wrist band during Peddi movie promotions.

పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం.. సర్జరీ చేయించుకోనున్న గ్లోబల్ స్టార్..

శనివారం, 30 మే 2026, 12:49 సా.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ జంట‌గా న‌టించిన పెద్ది మూవీ ఎట్ట‌కేల‌కు పాన్ ఇండియా వైడ్‌గా విడుద‌ల‌వుతుండ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై అంద‌రి ఆస‌క్తి నెల‌కొంది. అయితే పెద్ది చిత్ర షూటింగ్ స‌మ‌యంలో చ‌ర‌ణ్ చేతికి ఏర్ప‌డిన గాయం కార‌ణంగా ఆయ‌న త్వ‌ర‌లో స‌ర్జ‌రీ చేయించుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

A police case filed over fake news about Megastar Chiranjeevi health condition.

మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు!

బుధవారం, 27 మే 2026, 12:16 సా.

మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ మాఫియా భారీ స్థాయిలో పెరిగిపోతూ సెలబ్రిటీలపై అసత్య ప్రచారాలు చేస్తూ డబ్బులు ఆర్జిస్తోంది.

Actress Kangana Ranaut in a traditional married woman look from her movie shoot.

రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? ఆ వైరల్ ఫోటోలపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్!

ఆదివారం, 24 మే 2026, 1:28 సా.

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ తాజాగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. మంగళసూత్రం, ఆకుపచ్చ గాజులు ధరించిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుందని ప్రచారం మొదలైంది.

Tollywood actor Akkineni Nagarjuna during his recent media interview.

సినిమాల్లోకి అనుకోకుండా వచ్చా.. బాక్సాఫీస్ లెక్కలతో పనిలేదు: కింగ్ నాగార్జున ఓపెన్ కామెంట్స్!

ఆదివారం, 24 మే 2026, 11:44 ఉద.

తాను సినిమాల్లోకి కావాల‌ని రాలేద‌ని, యాదృచ్ఛికంగానే జ‌రిగింద‌ని, అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు త‌న‌ను ఆద‌రించార‌ని, ఆ క్ర‌మంలోనే తాను ఈ స్థాయికి చేరుకోగ‌లిగాన‌ని న‌టుడు నాగార్జున అన్నారు.

Actor Ram Charan and Janhvi Kapoor at the Peddi movie music concert in Bhopal.

‘పెద్ది’ నా కెరీర్‌లోనే నంబర్ 1 సినిమాగా నిలుస్తుంది: రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్!

శనివారం, 23 మే 2026, 11:51 సా.

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తాను చేసిన పెద్ది మూవీపై ఎంతో మ‌న‌సు పెట్టి చేశాన‌ని, ఈ సినిమా త‌న కెరీర్ లో ఎప్ప‌టికీ నంబ‌ర్ 1 గా నిలుస్తుంద‌ని న‌టుడు రామ్ చ‌ర‌ణ్ అన్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టిస్తున్న పెద్ది మూవీ జూన్ 4న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు.

Director Buchi Babu Sana talking about Ram Charan's Peddi movie climax.

రామ్ చరణ్ ‘పెద్ది’ క్లైమాక్స్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆసక్తికర వ్యాఖ్యలు!

శనివారం, 16 మే 2026, 12:38 సా.

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చి బాబు సానా తాజాగా గ్రేట్ ఆంధ్రా కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన‌ విషయాలను వెల్లడించారు. సిరాశ్రీతో జరిగిన ఈ సంభాషణలో పెద్ది క్లైమాక్స్‌పై వచ్చిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Actor Naresh posing with his new blue Porsche Panamera G3 Turbo.

టాలీవుడ్‌లో ఫస్ట్.. రూ. 2.7 కోట్ల ఖరీదైన పోర్షే కారు కొన్న నటుడు నరేష్!

శుక్రవారం, 15 మే 2026, 10:39 సా.

న‌ట‌న‌లోనే కాదు, ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్‌ను అనుభ‌వించ‌డంలోనూ ఎంతో పేరుగాంచిన న‌టుడు న‌రేష్ తాజాగా మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ కారును త‌న గ్యారేజీ క‌లెక్ష‌న్‌లో చేర్చారు. లుగానో బ్లూ కలర్‌లోని పోర్షె ప‌న‌మెరా జి3 ట‌ర్బో కారును ఆయ‌న కొనుగోలు చేశారు. హైద‌రాబాద్ రోడ్ల‌పై ఈ కారు ప్ర‌స్తుతం సంద‌డి చేస్తుండ‌గా, తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈ కారును సొంతం చేసుకున్న తొలి న‌టుడిగా ఆయ‌న నిలిచారు.

Producer Dil Raju at a press conference in Hyderabad discussing theater percentage system.

సింగిల్ స్క్రీన్ థియేటర్లకు దిల్ రాజు గుడ్ న్యూస్.. పర్సెంటేజ్ సిస్టమ్‌పై కీలక నిర్ణయం!

శుక్రవారం, 15 మే 2026, 6:00 సా.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ సిస్టమ్ అమలుపై ఎగ్జిబిటర్ల డిమాండ్‌కు సానుకూల స్పందన లభించిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు శుక్రవారం (మే 15, 2026) హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు.

Junior NTR and Prashanth Neel movie title Dragon official update.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఫిక్స్? సోషల్ మీడియాలో ‘డ్రాగన్’ సెన్సేషన్!

గురువారం, 14 మే 2026, 8:06 సా.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ను #NTRNeel హ్యాష్‌ట్యాగ్‌తో ప్రమోట్ చేస్తూ వచ్చిన మేకర్స్, ఇప్పుడు అధికారిక టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Ram Charan's Peddi movie promotional tour at Uppal Stadium during IPL 2026 match.

ఐపీఎల్ మ్యాచ్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’ సందడి.. ముంబైలో ట్రైలర్ లాంచ్, ఉప్పల్ స్టేడియంలో పవర్ ప్లే టూర్!

గురువారం, 14 మే 2026, 6:25 సా.

స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా జోన‌ర్‌ల‌లో తెర‌కెక్కుతున్న పెద్ది మూవీపై రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌తోపాటు సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌గా, రిలీజ్ తేదీ ద‌గ్గ‌ర‌వుతున్న కొద్దీ అంద‌రిలోనూ ఆతృత పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే సినిమాకు మ‌రింత ఎక్కువ ప్ర‌మోష‌న్ క‌ల్పించేందుకు చిత్ర యూనిట్ పెద్ది ప‌వ‌ర్‌ప్లే టూర్ పేరిట ఓ భారీ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

Next