నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్‌బీకే111 గురించి నటి కాజల్ అగర్వాల్ ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కాజల్ ఈ చిత్రంలో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మరోసారి నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను ఎన్‌బీకే111లో భాగమయ్యానని, బాలకృష్ణతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. ఆయన ఒక లెజెండ్ అని, సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా ఉంటారని, అందరినీ ఉత్సాహంగా ఉంచుతూ షూటింగ్ వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తారని కాజల్ పేర్కొన్నారు.
ఇది ఎంతో పవర్‌ఫుల్ క్యారెక్టర్..
తన పాత్ర గురించి మాట్లాడిన ఆమె, ఇది ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని వెల్లడించారు. తన పాత్ర చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుందని, ఇది ఎంతో పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని, బాలకృష్ణకు జోడీగా ఇలాంటి బలమైన పాత్రను పోషించడం నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ అని తెలిపారు. ఎన్‌బీకే111 చిత్రం ద్వారా కాజల్, బాలకృష్ణతో రెండోసారి జతకడుతున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన భగవంత్ కేసరి మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌లో ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఇద్దరికీ హిట్లు లేవు..
కాగా బాలకృష్ణ చివరిసారిగా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఆయన తన తరువాతి సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ చివరిసారిగా తెలుగులో ఆచార్య చిత్రంలో నటించారు. అయినప్పటికీ ఆమె పాత్రను చివరి నిమిషంలో తొలగించడంతో ఆ సన్నివేశాలు లేకుండానే చిత్రాన్ని రిలీజ్ చేశారు. తరువాత ఘోస్ట్ మూవీలో యాక్ట్ చేసినా అది వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఆ తరువాత ఆమె పలు ఓటీటీ సిరీస్‌లు, సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇండియన్ 3, రామాయణ, విశాఖ అనే మూవీల్లో ఆమె నటిస్తున్నారు.

స్పందించండి