గురువారం, జూన్ 11, 2026
వినోదం

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఫిక్స్? సోషల్ మీడియాలో ‘డ్రాగన్’ సెన్సేషన్!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ను #NTRNeel హ్యాష్‌ట్యాగ్‌తో ప్రమోట్ చేస్తూ వచ్చిన మేకర్స్, ఇప్పుడు అధికారిక టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఫిక్స్? సోషల్ మీడియాలో ‘డ్రాగన్’ సెన్సేషన్!
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రాబోతున్న ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్. Photo Credit: Social Media/X.
Junior NTR and Prashanth Neel movie title Dragon official update.
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రాబోతున్న ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్. Photo Credit: Social Media/X.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌ను #NTRNeel హ్యాష్‌ట్యాగ్‌తో ప్రమోట్ చేస్తూ వచ్చిన మేకర్స్, ఇప్పుడు అధికారిక టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గ్రేట్ ఆంధ్రా తెలిపిన ప్రకారం ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో డ్రాగన్ టైటిల్ చాలా కాలంగా వినిపిస్తున్నప్పటికీ, చిత్రబృందం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఈ టైటిల్‌తో ప్రత్యేక గ్లింప్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20కు ముందు అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా మే 19 అర్ధరాత్రి ఈ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ వీడియో ద్వారానే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

బీస్ట్ మోడ్ క్యారెక్ట‌ర్‌లో ఎన్‌టీఆర్‌..

అంతేకాదు, ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ కొత్త అవతార్‌ను కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్‌ను అత్యంత పవర్‌ఫుల్, బీస్ట్ మోడ్ క్యారెక్టర్‌లో చూపించనున్నారని సమాచారం. పలు కీలక యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన పాత్ర విపరీతమైన ఇంటెన్సిటీతో కనిపిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని తన కెరీర్‌లోనే అతిపెద్ద యాక్షన్ స్పెక్టకిల్‌గా మలచాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాను మరింత పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు అదనపు సమయం తీసుకుంటున్నారని సమాచారం. ఈ కారణంగానే మొదట జూన్ 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు జూన్ 2027కు వాయిదా వేసినట్లు తెలిసింది. అయితే అధికారిక విడుద‌ల తేదీని ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోయినా ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఇదే టైముకు రిలీజ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

ఆక‌ట్టుకోని వార్ 2..

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేక పాత్ర‌లో ఇటీవ‌లే వ‌చ్చిన వార్ 2 మూవీ ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇందులో ఆయ‌న హృతిక్ రోష‌న్‌తో క‌లిసి న‌టించారు. ఎన్‌టీఆర్ లుక్‌, గ్రాఫిక్స్ స‌రిగ్గా లేవ‌ని ప్రేక్ష‌కులు ఈ సినిమాను భారీ ఎత్తున ట్రోల్ చేశారు. అయితే అంత‌కు ముందు వ‌చ్చిన దేవ‌ర సినిమా భారీ హిట్ అయింది. దీంతో దేవ‌ర 2 రిలీజ్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ చెప్పారు. కానీ ఈ మూవీ ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ప్ర‌శాంత్ నీల్‌తో తెర‌కెక్కిస్తున్న డ్రాగ‌న్ మూవీ పూర్త‌యితే ఎన్‌టీఆర్ త‌రువాత నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేస్తారు. ఆ త‌రువాతే దేవ‌ర 2 ఉంటుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి