About Us / మా గురించి

ఇండియా డైలీ లైవ్ (India Daily Live) – నిజం.. నిష్పక్షపాతం.. మీ కోసం!

పరిచయం: నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో, వార్తల వెల్లువలో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం పాఠకులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, పాత్రికేయ విలువలకు పట్టం కడుతూ, వాస్తవాలను వెలికితీసే లక్ష్యంతో ‘ఇండియా డైలీ లైవ్’ ఆవిర్భవించింది. ఇది BSR Media సంస్థకు చెందిన అధికారిక డిజిటల్ వార్తా వేదిక.

మా అనుభవం – మీ నమ్మకం: ఇండియా డైలీ లైవ్ కేవలం ఒక వెబ్‌సైట్ మాత్రమే కాదు.. దశాబ్దాల అనుభవం ఉన్న జర్నలిస్టుల సమిష్టి కృషి. తెలుగు మీడియా రంగంలో దిగ్గజ సంస్థలైన ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ పాత్రికేయుల పర్యవేక్షణలో ఈ వార్తా సంస్థ నడుస్తోంది. ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో మాకున్న అపారమైన అనుభవంతో, ప్రతి వార్తను లోతుగా విశ్లేషించి పాఠకులకు అందిస్తున్నాము.

మా లక్ష్యం (Our Mission): కేవలం బ్రేకింగ్ న్యూస్ అందించడమే కాకుండా, ఆ వార్త వెనుక ఉన్న సామాజిక, రాజకీయ కోణాలను విశ్లేషించడం (Analysis) మా ప్రత్యేకత. రాజకీయాలు, క్రైమ్, సినిమాలు, విద్యా-ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యం, బిజినెస్‌, ఆధ్యాత్మికం మరియు సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పాఠకులకు చేరవేస్తున్నాము.

ఎడిటోరియల్ నిబద్ధత:

నిజనిర్ధారణ: ప్రతి వార్తను ప్రచురించే ముందు రెండు స్థాయిలలో (Fact-check) సరిచూస్తాము.

పారదర్శకత: వార్త యొక్క మూలాలను (Sources) గౌరవిస్తూ, ఎటువంటి పక్షపాతం లేకుండా వార్తలను అందిస్తాము.

బాధ్యత: సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా, బాధ్యతాయుతమైన జర్నలిజం చేయడమే మా పరమావధి.

కార్యాలయం: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మా న్యూస్‌రూమ్ నుంచి అనునిత్యం తాజా వార్తా విశేషాలను అందిస్తున్నాము.

BSR Media తరపున, విలువలతో కూడిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము.

నిర్వాహణ మరియు సంప్రదింపు వివరాలు

యాజమాన్యం: BSR Media

ఎడిటర్-ఇన్-చీఫ్: బి.సాంబిరెడ్డి (Senior Journalist, 14+ Years Experience)

ఆఫీస్ అడ్రస్: ప్లాట్ నం.68, కృషి మాధ‌వ నెస్ట్‌, ప‌టాన్‌చెరు, హైదరాబాద్, తెలంగాణ – 502319.

సంప్రదించండి: editor@indiadailylive.com