గురువారం, జూన్ 11, 2026
వినోదం

టాలీవుడ్‌లో ఫస్ట్.. రూ. 2.7 కోట్ల ఖరీదైన పోర్షే కారు కొన్న నటుడు నరేష్!

న‌ట‌న‌లోనే కాదు, ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్‌ను అనుభ‌వించ‌డంలోనూ ఎంతో పేరుగాంచిన న‌టుడు న‌రేష్ తాజాగా మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ కారును త‌న గ్యారేజీ క‌లెక్ష‌న్‌లో చేర్చారు. లుగానో బ్లూ కలర్‌లోని పోర్షె ప‌న‌మెరా జి3 ట‌ర్బో కారును ఆయ‌న కొనుగోలు చేశారు. హైద‌రాబాద్ రోడ్ల‌పై ఈ కారు ప్ర‌స్తుతం సంద‌డి చేస్తుండ‌గా, తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈ కారును సొంతం చేసుకున్న తొలి న‌టుడిగా ఆయ‌న నిలిచారు.

టాలీవుడ్‌లో ఫస్ట్.. రూ. 2.7 కోట్ల ఖరీదైన పోర్షే కారు కొన్న నటుడు నరేష్!
సరికొత్త లగ్జరీ కారుతో నటుడు నరేష్. Photo Credit: Naresh/X.
Actor Naresh posing with his new blue Porsche Panamera G3 Turbo.
సరికొత్త లగ్జరీ కారుతో నటుడు నరేష్. Photo Credit: Naresh/X.

న‌ట‌న‌లోనే కాదు, ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్‌ను అనుభ‌వించ‌డంలోనూ ఎంతో పేరుగాంచిన న‌టుడు న‌రేష్ తాజాగా మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ కారును త‌న గ్యారేజీ క‌లెక్ష‌న్‌లో చేర్చారు. లుగానో బ్లూ కలర్‌లోని పోర్షె ప‌న‌మెరా జి3 ట‌ర్బో కారును ఆయ‌న కొనుగోలు చేశారు. హైద‌రాబాద్ రోడ్ల‌పై ఈ కారు ప్ర‌స్తుతం సంద‌డి చేస్తుండ‌గా, తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈ కారును సొంతం చేసుకున్న తొలి న‌టుడిగా ఆయ‌న నిలిచారు. న‌రేష్‌కు ల‌గ్జ‌రీ వాహ‌నాలు అంటే ఎంతో ఇష్టం. ఆయ‌న ఆస్తి గురించి కూడా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌తంలో ఆయ‌న త‌న క‌స్ట‌మ్ క్రూయిజ‌ర్‌తో వార్త‌ల్లో నిలిచారు. ఇప్పుడు ఈ కారుతో మ‌రోమారు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు.

అంద‌రిలోనూ ప్ర‌త్యేక గుర్తింపు..

టాలీవుడ్‌లో మావెరిక్ యాక్టర్‌గా గుర్తింపు పొందిన న‌రేష్ మరోసారి తన ప్రత్యేకమైన స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్నారు. కొత్త ట్రెండ్స్‌ను ఫాలో కావడంలో నరేష్ ఎప్పుడూ ముందుంటారు. టాలీవుడ్‌లో అత్యంత వైవిధ్యమైన నటులలో ఒకరిగా పేరుపొందిన ఆయన, అన్‌కన్వెన్షనల్ రోల్స్ ఎంపికలో ప్రత్యేక శైలి కనబరుస్తుంటారు. అందుకే యంగ్ డైరెక్టర్లు, జెన్ జీ, యువ ప్రేక్షకుల్లో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ చూపించిన నరేష్ ప్రభావం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. రియల్ ఎస్టేట్, ఫిల్మ్ స్టూడియోలు, ఫుడ్ ఇండస్ట్రీ వంటి రంగాల్లో కూడా విజయవంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.

కారు ఫీచ‌ర్లు ఇవే..

లగ్జరీ కార్లపై ఆయనకు ఉన్న ఆసక్తి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో ఆయన కస్టమ్ క్రూయిజర్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేయగా, ఇప్పుడు మరో అద్భుతమైన కారును తన గ్యారేజ్‌లోకి తీసుకొచ్చారు. నరేష్ తాజాగా లుగానో బ్లూ కలర్‌లోని పోర్షె ప‌న‌మెరా జి3 ట‌ర్బో కారును కొనుగోలు చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సెన్సేషనల్ మిషన్‌ను సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. హైదరాబాద్ రోడ్లపై ఈ స్పోర్టీ మాస్టర్‌పీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుమారు రూ.2.7 కోట్ల విలువైన ఈ పోర్షే కారు కేవలం 4.8 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అత్యున్నత లగ్జరీతోపాటు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను కలగలిపిన ఈ కొత్త కారు, నరేష్ వ్యక్తిత్వానికి, ఆయన హై-ఆక్టేన్ ఎనర్జీకి పర్ఫెక్ట్ మ్యాచ్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి