Sree Leela : వామ్మో.. శ్రీ‌లీల ఒక్క సినిమాకు అంత భారీ మొత్తం తీసుకుంటుందా..?

April 4, 2022 6:59 PM

Sree Leela : ఇటీవ‌ల కుర్ర‌భామ‌లు ఒక్క సినిమాతోనే లైమ్ లైట్‌లోకి వ‌స్తున్నారు. మంచి సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటున్నారు. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో డెబ్యూ ఇవ్వ‌గా, ఇప్పుడు ఈ అమ్మ‌డికి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. ఇప్పుడు ఇదే రూట్‌లో శ్రీ లీల కూడా వెళుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల.. రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీలో నటిస్తోంది.

Sree Leela taking huge remuneration for one movie
Sree Leela

కుర్ర హీరోలు శ్రీలీల‌నే హీరోయిన్‌గా రికమెండ్ చేస్తున్నారట. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు.. అందరి దృష్టి అటువైపే ఉంటోంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అమ్మ‌డు నితిన్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ కానుంది.

తాజాగా ఈ చిత్రానికి శ్రీలీల అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. నితిన్ మూవీకిగానూ శ్రీలీల ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఒకే చెప్పారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా ధమాకా అనే సినిమాలో నటిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి డబ్యూ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్ ఖరారు అయింది. రాధాకృష్ణ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీతో జెనీలియా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now