వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.

March 10, 2026 7:26 PM
BCCI announcing ₹131 crore prize money for T20 World Cup 2026 winning team.
చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ. Photo Credit: AFP.

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన బీసీసీఐ, ఈసారి తన సొంత రికార్డును తానే అధిగమించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు మొత్తం టోర్నమెంట్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత జట్టు మూడోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పీటీఐ నివేదిక ప్రకారం ఈ రూ.131 కోట్ల బహుమతి మొత్తం 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి వర్తిస్తుంది.

బ‌హుమ‌తిని ఎలా విభజిస్తారు..?

ఈ బహుమతి మొత్తాన్ని ఎలా విభజిస్తారన్న విషయంపై బీసీసీఐ స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. అయితే పీటీఐకు అందిన సమాచారం ప్రకారం, రూ.131 కోట్ల బహుమతిలో ఎక్కువ భాగం ఆటగాళ్లకే కేటాయించబడుతుంది. సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తాన్ని వారి హైరార్కీ ప్రకారం నిర్ణయిస్తారు. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో విజేతలుగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తోంది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు బోర్డు మరోసారి అభినందనలు తెలియజేస్తోంది. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటోంది.. అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.

బీసీసీఐ అభినంద‌న‌లు..

ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. అదేవిధంగా ఆతిథ్య దేశంగా ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలిచిన తొలి జట్టుగా కూడా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు బోర్డు మరోసారి అభినందనలు తెలియజేస్తోంది. భవిష్యత్తులో కూడా వారు విజయాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం.. అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక‌ ప్రకటనలో తెలిపారు.

ఐసీసీ నుంచి రూ.21.5 కోట్లు..

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ గెలిచిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి కూడా గణనీయమైన ఆర్థిక బహుమతిని అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌కు ఐసీసీ విజేతల బహుమతిగా 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.21.5 కోట్లు) అందించింది. టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.17 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.10.75 కోట్లు) బహుమతిగా లభించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment