Sree Leela : వామ్మో పెళ్లిసందD శ్రీలీల ఆస్తి అన్ని కోట్లా ?

October 28, 2021 8:00 AM

Sree Leela : శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెళ్లి సందD. 25 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ నటించిన ఈ సినిమా 25 సంవత్సరాల తర్వాత ఆయన పర్యవేక్షణలో దసరా కానుకగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

Sree Leela assets she has got crores of rupees

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2001 జులై 14న అమెరికాలోని డెట్రాయిట్ లో శ్రీలీల.. శుభకరరావు అనే బిజినెస్ మ్యాన్, తల్లి స్వర్ణలత డాక్టర్ దంపతులకు జన్మించింది. ఈమెకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఈమె కుటుంబం అమెరికా నుంచి బెంగళూరు మారిన తర్వాత తన తల్లి మాదిరిగానే తను కూడా వైద్య వృత్తిలో స్థిరపడాలని భావించింది. ఈ క్రమంలోనే మెడిసిన్ చదువుతూ మోడలింగ్ వైపు వెళ్లి 2019లో కన్నడ సినిమాల్లో నటించింది.

ఇలా తన మొదటి సినిమాకి రూ.25 లక్షల పారితోషికం తీసుకోగా పెళ్లి సందD సినిమాకు రూ.30 లక్షల పారితోషికం తీసుకుంది. ఈమెకు బెంగళూరులో ఖరీదైన బంగ్లాలు, కార్లు ఉన్నాయని సమాచారం. బెంగళూరులో ఉన్న ఇతర ఆస్తులను కలుపుకుంటే ఈమెకు సుమారుగా రూ.20 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లిసందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల కోసం టాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now