Sree Leela : శ్రీ‌లీల ల‌క్ మామూలుగా లేదు.. ఇంకో బ‌డా మూవీలో చాన్స్ కొట్టేసింది..!

July 11, 2022 8:09 PM

Sree Leela : టాలీవుడ్ లో ఈ మ‌ధ్య కాలంలో యువ హీరోయిన్లు చేస్తున్న సంద‌డి మామూలుగా ఉండ‌డం లేదు. ముఖ్యంగా కృతిశెట్టి, శ్రీ‌లీల పిచ్చ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. కృతిశెట్టి అయితే మొద‌టి మూడు సినిమాలు హిట్ కావ‌డంతో ఏకంగా చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలో బిజీగా మారింది. మ‌రోవైపు మొద‌టి సినిమా అంత‌గా హిట్ కాక‌పోయినా శ్రీ‌లీల‌కు కూడా ఆఫ‌ర్లు మామూలుగా రావ‌డం లేదు. ఏకంగా బాల‌య్య సినిమాలోనే న‌టించే చాన్స్ కొట్టేసింది. ఆయ‌న‌కు కుమార్తెగా శ్రీ‌లీల ఓ మూవీలో క‌నిపించనుంద‌ని స‌మాచారం.

ఇక శ్రీ‌లీల క‌న్న‌డ సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చినా ఆమెకు గుర్తింపు వ‌చ్చింది మాత్రం తెలుగు సినిమాల‌తోనే. ఈ క్ర‌మంలోనే ఆమె పెళ్లి సంద‌డితో ప‌రిచ‌యం అయింది. త‌రువాత ఆమెకు ఆఫ‌ర్లు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. ఆమె ప్ర‌స్తుతం మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ‌తో క‌లిసి ధ‌మాకా అనే మూవీలో న‌టిస్తోంది. అలాగే నితిన్ సినిమాలోనూ న‌టించే చాన్స్‌నూ ద‌క్కించుకుంది. దీంతోపాటు ఇంకో మూవీలో బాల‌య్య కుమార్తెగానూ ఆమె న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఇంకో బిగ్ మూవీలో న‌టించే చాన్స్ కొట్టేసింద‌ని అంటున్నారు.

Sree Leela may act in Mahesh Babu movie
Sree Leela

శ్రీ‌లీల ప్ర‌స్తుతం మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె మ‌హేష్ బాబు మూవీలో న‌టించ‌నుంద‌ని స‌మాచారం. మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో ఇప్ప‌టికే పూజా హెగ్డెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఆమె చెల్లెలి పాత్ర‌లో.. అంటే మ‌హేష్‌కు మ‌ర‌ద‌లి పాత్ర‌లో శ్రీ‌లీల న‌టించ‌నుంద‌ట‌. ఈ విష‌యం ఇంకా అధికారికంగా క‌న్‌ఫామ్ కాలేదు. కానీ దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేస్తార‌ని సమాచారం. ఇక మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబో మూవీ ఆగ‌స్టులో ప్రారంభం కానుంది. ఇది పూర్త‌య్యాక జ‌న‌వ‌రి నుంచి మ‌హేష్.. రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now