Sree Leela : MBBS ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్న పెళ్లి సంద‌D బ్యూటీ శ్రీ‌లీల‌..!

November 28, 2021 8:07 PM

Sree Leela : అప్ప‌ట్లో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు తెర‌కెక్కించిన పెళ్లి సంద‌డి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. అయితే అదే మూవీ పేరిట మ‌ళ్లీ శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్‌తో ఆయ‌న పెళ్లి సంద‌D అనే సినిమాను తీశారు. ఈ మూవీకి కూడా అంద‌రి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇందులో రోష‌న్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.

Sree Leela : MBBS ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్న పెళ్లి సంద‌D బ్యూటీ శ్రీ‌లీల‌..!

అయితే తొలి సినిమాతోనే శ్రీ‌లీల న‌ట‌న‌లో తానేంటో నిరూపించుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. పెళ్లి సంద‌D సినిమా ద‌స‌రా సంద‌ర్బంగా విడుద‌లై మంచి టాక్‌ను తెచ్చుకుంది. కాగా ప్ర‌స్తుతం శ్రీ‌లీల త‌న చ‌దువులపై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

పెళ్లి సంద‌D సినిమా హిట్ కావ‌డంతో శ్రీలీల‌కు బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆమె చ‌దువుపై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఆమె ప్రిపేర్ అవుతోంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల ముంబైలో ఉండ‌గా.. అక్క‌డే ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మవుతోంది.

ఇక కొద్ది రోజుల పాటు ఆమె అక్క‌డే ఉండ‌నుంది. మ‌ళ్లీ ప‌రీక్ష‌లు అయ్యాక మూవీల్లో న‌టించ‌నుంది. శ్రీ‌లీల ఇప్ప‌టికే ప‌లు వ‌రుస సినిమాల‌కు సైన్ చేసింది. ఈ క్ర‌మంలోనే కొన్ని మూవీల‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈమె టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌ల‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలోకి వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ బ్యూటీతో సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోలు ఆస‌క్తిని చూపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now