Ravi Teja : ర‌వితేజ‌పై దారుణ‌మైన ట్రోల్స్‌.. శ్రీ‌లీల ఆయ‌న‌కు మ‌న‌వ‌రాల‌ట‌..!

September 3, 2022 5:25 PM

Ravi Teja : మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌. ఈ పేరులో ఏదో తెలీని ఎన‌ర్జీ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన వారిలో రవితేజ ఒకరు. ఒకప్పుడు చిన్నాచితకా వేషాలు వేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా మారాడు. ర‌వితేజ‌కు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్ అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి మూవీ. అయితే గత 4, 5 సంవత్సరాల్లో రవితేజకు పెద్దగా హిట్ పడింది లేదు. గత ఏడాది కరోనా తర్వాత వచ్చిన క్రాక్ సినిమా ఒక్కటే రవితేజ కెరీర్‌ను నిలబెట్టింది. అది కూడా డైరెక్టర్ మలినేని గోపీచంద్ పుణ్యమా అని రవితేజ ఖాతాలో హిట్ పడింది.

క్రాక్ హిట్ అయిందో లేదో రవితేజ వెంటనే తన రెమ్యూనరేషన్ పెంచేశాడు. కథ, కథనం కంటే.. రవితేజ రెమ్యూనరేషన్ పైనే దృష్టి పెడతాడు అనే టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే క్రాక్ తర్వాత వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్‌ డ్యూటీ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం రవితేజ న‌క్కిన త్రినాథ‌రావు దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. టాలీవుడ్‌లో తన అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపుతున్న పెళ్లి సందడి ఫేమ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల‌ రవితేజ సరసన నటిస్తోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్.. టీజర్లలో రవితేజ, శ్రీలీల‌తో చేసిన రొమాన్స్ చూసిన ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు.

netizen heavy troll on Ravi Teja for acting with Sree Leela
Ravi Teja

50 ఏళ్ళు దాటేసిన ముసలోడికి 20 ఏళ్ల కుర్ర హీరోయిన్ శ్రీలలతో రొమాన్స్ ఏంటి ? ఆ టీజర్ లో రవితేజ ఎక్స్‌ప్రెషన్లు అసలు చూడలేకపోతున్నాంరా బాబోయ్, షుగర్ పేషేంట్ అయిన తాతయ్య స్వీట్ కోసం మనవరాలిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఉంది వీళ్ళ రొమాన్స్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తన వయసుకు తగ్గ పాత్రలు వేసుకోవాలి కానీ కుర్ర హీరోయిన్లను వెంటపెట్టుకుని ఇంకా ప్రేమ కథలు.. రొమాన్స్ లు అని చేసుకుంటూ పోతే మరో డిజాస్టర్ తప్పేలా లేదు అంటున్నారు నెటిజన్లు. ఏదైనా ధమాకా కూడా ప్లాప్ అయితే రవితేజను టాలీవుడ్ మర్చిపోయేందుకు పెద్ద సమయం పట్టకపోవచ్చు. మరి ఇప్పటికైనా రవితేజ కథ, కథనం, హీరోయిన్ సెలక్షన్ మీద దృష్టి పెడతాడో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now