Sree Leela : బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన శ్రీ‌లీల‌.. ఏకంగా బాల‌కృష్ణ సినిమాలో చాన్స్‌..?

May 22, 2022 7:16 PM

Sree Leela : యంగ్ హీరోయిన్ శ్రీ‌లీల ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో జోరు మీద ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె న‌టించిన పెళ్లి సంద‌D మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ ఈమె గ్లామ‌ర్‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ఈమె ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ ప‌క్క‌న ఈ బ్యూటీ ధ‌మాకా అనే మూవీలో నటిస్తోంది. అయితే శ్రీ‌ల‌ల తాజాగా ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను కొట్టేసింద‌ని తెలుస్తోంది.

శ్రీ‌ల‌ల‌.. ఏకంగా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని సంపాదించింద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆ మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి అన్న‌గారు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న విష‌యం విదిత‌మే. అయితే ఈ సినిమా అనంత‌రం అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా చేస్తారు. ఇందులోనే శ్రీ‌లీల‌ను తీసుకుంటున్నార‌ని స‌మాచారం. ఈమె అందుకు ఓకే చెప్పిన‌ట్లుగా కూడా తెలుస్తోంది.

Sree Leela got bumper offer she may act in Balakrishna movie
Sree Leela

అయితే శ్రీ‌లీల బాల‌కృష్ణ ప‌క్క‌న హీరోయిన్ గా కాదు.. ఆయ‌న‌కు ఆ సినిమాలో కూతురుగా న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బాల‌కృష్ణ ఆ మూవీలో 50 ఏళ్ల వ‌య‌స్సు పాత్ర‌లో న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఆ క్యారెక్ట‌ర్‌కు భార్య ఓ సీనియ‌ర్ హీరోయిన్‌ను ఎంపిక చేయ‌నున్నార‌ట‌. ఇక వీరికి కుమార్తె పాత్ర‌లో శ్రీ‌లీల న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలో తండ్రి, కూతురు సెంటిమెంట్‌ను హైలైట్ చేసి చూపిస్తార‌ట‌. ఇక దీనిపై త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment