బుధవారం, జూన్ 24, 2026
వార్తలు

Akhil Akkineni : ల‌వ‌ర్ బాయ్ ఇంత భారీ కండ‌లు పెంచి పెద్ద‌ షాక్ ఇస్తున్నాడుగా..!

Akhil Akkineni : నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ త‌న తొలి చిత్రాన్ని వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. అఖిల్ పేరుతో వ‌చ్చిన ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేశాడు…

Akhil Akkineni : ల‌వ‌ర్ బాయ్ ఇంత భారీ కండ‌లు పెంచి పెద్ద‌ షాక్ ఇస్తున్నాడుగా..!

Akhil Akkineni : నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ త‌న తొలి చిత్రాన్ని వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. అఖిల్ పేరుతో వ‌చ్చిన ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేశాడు అఖిల్. హలో అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా అఖిల్ కు హ్యాండ్ ఇచ్చింది. ఆ వెంటనే మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫర్లేదు అనిపించుకుంది. దాంతో చిన్న గ్యాప్ తీసుకున్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ ను ఎంచుకున్నాడు.

Akhil Akkineni latest pic trending can be seen with muscles

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. ముఖ్యంగా కండ‌లు తిరిగిన దేహంతో అబ్బుర‌ప‌రిచేందుకు చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.

అఖిల్ ‘ఏజెంట్’ మూవీ కోసం చాలా కాలంగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీతో కూడా కనిపించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హాలీవుడ్ హీరోలా మారిపోయిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో వదిలాడు. దీనికి ‘2022లో ఒక తుఫాను రాబోతుంది. దాన్ని నేను ఫీల్ అవుతున్నాను’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక, ఇందులో అతడు జుట్టు ముడిపెట్టుకుని, తల కిందకు దించి కూర్చున్నాడు. అస‌లు ఇత‌డు అఖిలేనా అంటూ అంద‌రూ నోరెళ్ల‌బెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి