Akhil Akkineni : అఖిల్‌, జాన్వీక‌పూర్‌.. భ‌లే కాంబినేష‌న్‌..?

March 12, 2022 7:33 PM

Akhil Akkineni : అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరియర్ మొదట్లో వరుస మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి. అయితే నాలుగవ సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా సూపర్ హిట్ ను అందుకున్న అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల కానుంది.

Janhvi Kapoor may act in Akhil Akkineni movie
Akhil Akkineni

ఈ సినిమా విడుదల కాకుండానే అఖిల్ బాలీవుడ్ దర్శక నిర్మాతలతో కలిసి పని చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న కరణ్ జోహార్ నిర్మాణంలో అఖిల్ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇలా కెరియర్ మొదట్లోనే ఇలాంటి నిర్మాణ సంస్థలో నటించే అవకాశం దక్కించుకోవడం చూస్తుంటే అఖిల్ త్వరలోనే పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకులను సందడి చేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తోంది.

ఇక కరణ్ జోహార్ నిర్మాణంలో అఖిల్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో అఖిల్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాన్వీ కపూర్ కూడా ఒక మంచి సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తన తండ్రి బోనీ కపూర్ కూడా వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అఖిల్ సరసన జాన్వీ కపూర్ సందడి చేయనుందా ? లేదా.. అనే విషయంపై క్లారిటీ రావల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now