Akhil Akkineni : అఖిల్ ఏజెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

May 23, 2022 1:13 PM

Akhil Akkineni : అక్కినేని అఖిల్ చాలా రోజుల త‌రువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంతో హిట్ కొట్టాడు. ఇందులో అఖిల్‌కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె న‌టించింది. అయితే పూజా వ‌ల్లే సినిమా హిట్ అయింద‌ని అన్నారు. దీంతో పేరు మొత్తం ఆమెకే వెళ్లింది. కానీ అఖిల్ యాక్టింగ్ అయితే ఇందులో సూప‌ర్బ్‌గా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకునేలా అఖిల్ పాత్ర‌ను ఇందులో తీర్చిదిద్దారు. అయితే అఖిల్ త్వ‌ర‌లోనే ఏజెంట్‌గా మ‌న ముందుకు రానున్నాడు. గూఢ‌చారి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అఖిల్ అక్కినేని న‌టిస్తున్న ఏజెంట్ సినామా ఆగ‌స్టు 12వ తేదీన విడుద‌ల కానుంది. ఆ రోజు భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ఇంకో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీనికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంకా రిలీజ్ కానేలేదు.. అప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీకి సంబంధించిన డిజిట‌ల్ హ‌క్కుల‌ను కైవ‌సం చేసుకుంది. దీంతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

Akhil Akkineni Agent movie OTT platform fixed know the app
Akhil Akkineni

ఇక అమెజాన్ ప్రైమ్ ఇటీవ‌లే కేజీఎఫ్ 2, స‌ర్కారు వారి పాట హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా హ‌క్కుల‌ను కూడా పొందింది. ఇక మూవీ ఆగ‌స్టు 12న రిలీజ్ అవుతుంది క‌నుక సెప్టెంబ‌ర్ 12 త‌రువాత ఏజెంట్ మూవీ ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ మూవీ గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment