Akhil Akkineni : వాహ్‌.. ఏమున్నాడ్రా బాబూ.. హాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్నాడని అఖిల్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌..

May 30, 2022 10:05 AM

Akhil Akkineni : మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ మూవీ సక్సెస్ అనంతరం అక్కినేని అఖిల్‌ చాలా జోరు మీద ఉన్నాడు. చాలా రోజుల తరువాత ఒక మూవీ హిట్‌ కావడంతో అఖిల్‌ ఆ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అఖిల్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్‌ అనే ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఏజెంట్‌ సినిమాకు చెందిన పలు ముఖ్యమైన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అందులో బాగంగానే ఈ మూవీ షూటింగ్‌ను మనాలి పరిసరాల్లో కొనసాగిస్తున్నారు. అయితే ఈ మూవీలోంచి అఖిల్‌కు చెందిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అందులో అఖిల్‌ హాలీవుడ్‌ హీరోలా కనిపిస్తుండడం విశేషం.

అఖిల్‌కు చెందిన ఈ ఫొటోలో అఖిల్‌ డబుల్‌ జాకెట్‌ ధరించి ఉన్నాడు. మంచు కొండల్లో పోరాటాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రింగుల జుట్టుతో వెనుక చిన్నపాటి పోనీ టెయిల్‌ జుట్టును పెట్టుకుని అఖిల్‌ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలో అఖిల్‌ను చూస్తుంటే హాలీవుడ్‌ హీరో కిట్‌ హారింగ్‌టన్‌ గుర్తుకు వస్తున్నాడని అఖిల్‌ ఫ్యాన్స్ అంటున్నారు. కిట్‌ హారింగ్‌టన్‌ ప్రముఖ టీవీ సిరీస్‌ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ద్వారా పాపులర్‌ అయ్యాడు. అందులో ఆయన జాన్‌ స్నో అనే పాత్రలో అలరించారు. అందులో జాన్‌ స్నో పాత్రలో కూడా రింగుల జుట్టుతో కనిపిస్తాడు. అలాగే కిట్‌కు అఖిల్‌కు ముఖంలో పోలికలు కూడా ఒకేలా ఉన్నాయి. దీంతో కిట్‌ హారింగ్‌టన్‌తో అఖిల్‌ను పోలుస్తున్నారు. అచ్చం హాలీవుడ్‌ హీరోలా ఉన్నావని అఖిల్‌ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.

Akhil Akkineni look like Jon Snow fans are happy
Akhil Akkineni

ఇక అఖిల్‌ ఏజెంట్‌ మూవీలో మళయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే అఖిల్‌ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. ఈమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఆగస్టు 12వ తేదీన సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. గూఢచారి నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌ను చూస్తే తెలుస్తోంది. దీంతో అఖిల్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా ఎలా కనిపిస్తాడోనని ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment