Agent Movie : విడుద‌ల‌వ్వక ముందే రికార్డుల మోత మోగిస్తున్న ఏజెంట్ మూవీ..!

July 17, 2022 1:04 PM

Agent Movie : సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మూవీ.. ఏజెంట్‌. ఈ మూవీని ఆగ‌స్టు 12వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అయితే ఇందులో అఖిల్ న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రితీలో క‌నిపించాడు. ముఖ్యంగా అత‌ని బాడీ, యాటిట్యూడ్‌, మ్యాన‌రిజం పూర్తిగా మారిపోయాయి. పూర్తి మాస్ క్యారెక్ట‌ర్‌లో గూఢ‌చారిగా అఖిల్ అద‌ర‌గొట్టేశాడు. ఈ క్ర‌మంలోనే సినిమా రిలీజ్ అవ‌క‌ముందే ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది.

అఖిల్ ఏజెంట్ మూవీకి గాను తాజాగా ఓ రికార్డు న‌మోదు అయింది. మిడ్ రేంజ్ మూవీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే గ‌తంలో నాని అంటే సుంద‌రానికి మూవీ ట్రైల‌ర్‌కి 24 గంట్లో 3.13 ల‌క్ష‌ల లైక్స్ రాగా ఇప్పుడు దాన్ని ఏజెంట్ మూవీ బ్రేక్ చేసింది. కేవ‌లం 6 గంటల్లోనే ఏజెంట్ ట్రైల‌ర్ ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఇలా విడుద‌లక ముందే ఏజెంట్ సినిమా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ క్ర‌మంలోనే అఖిల్ ఈ మూవీతో ఇంకో హిట్ కొట్ట‌డం ప‌క్కా అని అంటున్నారు.

Akhil Akkineni Agent movie new record on Youtube
Agent Movie

అఖిల్ చివ‌రిసారిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ మూవీ భారీ విజ‌యం సాధించింది. అస‌లు అఖిల్‌కు కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ లేదు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌తో హిట్‌ను సాధించాడు. ఇక ఇప్పుడు రీసెంట్‌గా విడుద‌లైన ఏజెంట్ ట్రైల‌ర్‌ను చూస్తుంటే ఇంకో హిట్ ప‌క్కా అని అక్కినేని అభిమానులు అంటున్నారు. మ‌రి ఈ మూవీ ఎలా అల‌రిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment