Viral Pic : ఈ ఫొటోలో ఉన్న యంగ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా ?

August 15, 2022 9:21 AM

Viral Pic : చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా, ఎప్పుడైనా మధురమే. మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల్లో బాల్య స్మృతులు ఒకటి. మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం. అలాగే మనం ఫాలో అయ్యే, ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఒకప్పుడు ఎలా ఉండేవారు.. అని మనకు అనిపిస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడూ కొంత మంది సెలబ్రెటీస్ రేర్ పిక్స్, చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో ఉన్న చిన్నారి లిప్ స్టిక్ వేసుకుంటూ తన అందాన్ని అద్దంలో చూసుకుంటోంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు.. తొలి చిత్రంతోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ బ్యూటీ షాలిని పాండే. ఫస్ట్ మూవీతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది షాలిని. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి ఫుల్ పాపులారిటీ దక్కింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.

Viral Pic have you identified this actress in this photo
Viral Pic

అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్‌వీర్ సింగ్ సరసన జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీంతో ఇప్పుడు షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంద‌ని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మ‌రి దీంతోనైనా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు పెరుగుతాయా.. లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment