Viral Pic : ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టేశారా..?

August 18, 2022 10:05 PM

Viral Pic : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారల చిన్ననాటి జ్ఞాపకాలు చూడడానికి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో సామాజిక మాధ్యమాల్లో మంచి హడావిడి చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లైవ్ తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.

ఇటీవల తాజాగా ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బోసినవ్వుతో అమాయకంగా చూస్తున్న ముద్దులొలికే ఈ చిన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే కుర్రకారు మతులు పోగొట్టి మంచి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Viral Pic have you identified Payal Rajput in this picture
Viral Pic

తన లేటెస్ట్ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. ఈమె పెట్టే ఫొటోస్ అప్పుడప్పుడూ కాంట్రవర్సీల‌కు కూడా దారితీస్తుంటాయి. నెటిజన్లు సైతం చిత్రాలలో అవకాశాల కోసం మరీ ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఇంత అమాయకంగా కనిపించే ఆ చిన్నారి ఎవరో కాదు, అజయ్ భూపతి దర్శకత్వం లో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పూత్. ప్రస్తుతం ఈ అందాలభామ తెలుగు, తమిళ, కన్నడ భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now