Viral Pic : ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..? ఈమె డ్యాన్స్ చేస్తే విజిల్స్ వేస్తారు..

September 10, 2022 1:14 PM

Viral Pic : ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో  సోషల్ మీడియాలో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అయిపోతోంది. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. సెలబ్రిటీలు పోస్ట్ చేసే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన‌ తన చిన్ననాటి ఫోటో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఎవరు ఈ క్యూట్ బేబీ అంటూ వెతుకులాట మొదలైంది. ఈ ఫోటోల‌లో ఉన్న ముద్దులొలికే ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. ఇప్పుడు ఆ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూల్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో హీరో వరుణ్ కు జోడిగా నటించి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అంటూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే తన నటనతో, డాన్స్ తో కుర్రకారును తన మాయలో పడేసింది సాయి పల్లవి.

have you identified Sai Pallavi in this Viral Pic
Viral Pic

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ గా పరిచయమైనా కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం ఎక్స్‌పోజింగ్  చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అటు సినిమాలలోనూ, ఇటు యాడ్స్ లోనూ నటిస్తూ కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా చిత్రంలో చేసే క్యారెక్టర్ కు మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావిస్తూ ముందుకు దూసుకుపోతోంది లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి. విరాటపర్వం, గార్గి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో తన సహజసిద్ధమైన నటనతో ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now