Viral Pic : మ‌హేష్ బాబు ఎత్తుకున్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌.. ఎవ‌రో తెలుసా..?

September 21, 2022 11:20 AM

Viral Pic : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరో హీరోయిన్స్ గా ఎంట్రీ  ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఇండస్ట్రీలో చిన్న వయస్సులోనే నటన ప్రారంభించి  ఆ తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళల్లో ఈ చిన్నారి కూడా ఉంది. ఈ ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతిలో ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్. అంతేకాకుండా ఈమె పలు సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది.

2000 లో రిలీజ్ అయిన‌ జగపతిబాబు, అర్జున్ హీరోలుగా నటించన హనుమాన్ జంక్షన్, మహేష్ బాబు హీరోగా చేసిన యువరాజు సినిమాలోను, రవి తేజ నటించిన వీడే చిత్రంలో కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత తన దృష్టి మొత్తాన్ని చదువులపై పెట్టింది. ఇక ఆ తర్వాత 2010 లో రవిబాబు దర్శకత్వంలో మనసారా చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

do you know the child Sri Divya Viral Pic mahesh babu hands
Viral Pic

తెలుగుతోపాటు తమిళ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. తమిళ్ లో కార్తీ, శివకార్తికేయన్, జివి ప్రకాష్ వంటి హీరోలకు జోడీగా నటించింది ఈ చిన్నది. ఈమె ఇంకెవరో కాదు.. అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. మనసారా చిత్రం త‌ర్వాత వచ్చిన బస్ స్టాప్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రీదివ్య మల్లెల తీరంలో సిరిమల్లె పూవు, వారధి, కేరింత వంటి సినిమాలలో కూడా నటించింది. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్రీదివ్య. ఇక కేరింత సినిమా తర్వాత శ్రీదివ్య పూర్తిగా కెరీర్ ను సక్సెస్ ట్రాక్ లో పెట్టుకోవడానికి తమిళ్ సినిమాల మీదనే దృష్టి పెట్టడం జరిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment