Viral Pic : ఈ చిన్నారి స్టార్ హీరోలందరితోనూ నటించింది.. ఎవరో గుర్తొచ్చిందా..?

August 31, 2022 10:45 AM

Viral Pic : హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పడు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో.. ఫ్యాన్ పేజెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ చిన్నారి గత 20 ఏళ్లగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా రాణించింది. అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాకు.. హీరోయిన్ అంటే ముందుగా ఈమె గుర్తొచ్చేది.

ఇప్పుడు కూడా సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టలేదా.. ఇటీవల విజయ్ సేతుపతితో 96 అనే మోడర్న్ కల్ట్ క్లాసిక్ మూవీలో నటించింది. ఇప్పుడు గుర్తొచ్చింది కదా.. ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపాయి చెన్నై చంద్రం త్రిష కృష్ణన్. 2003లో వచ్చిన నీ మనసు నాకు తెలుసు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది త్రిష. వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సూపర్ హిట్ అవ్వడంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి.

Viral Pic have you identified Trisha
Viral Pic

తెలుగులో దాదాపు స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది త్రిష. అలాగే తమిళ్‌‌‌‌లోనూ పలు సూపర్ హిట్ మూవీల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ అగ్రహీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. 96 సినిమాతో చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందుకుంది త్రిష. ఇకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవలం తమిళ సినిమాలే చేస్తోంది. టాలీవుడ్ లోకి త్రిష రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now