బుధవారం, జూన్ 24, 2026
వార్తలు

Akhil Akkineni : ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో అఖిల్ రొమాన్స్ చేస్తున్నాడా..?

Akhil Akkineni : అక్కినేని మూడో త‌రం హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. అందమైన ప్రేమ కథతోపాటు చక్కటి ఎమోషన్స్ తో సాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.…

Akhil Akkineni : ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో అఖిల్ రొమాన్స్ చేస్తున్నాడా..?

Akhil Akkineni : అక్కినేని మూడో త‌రం హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. అందమైన ప్రేమ కథతోపాటు చక్కటి ఎమోషన్స్ తో సాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మొదటి హిట్‌ను అందుకున్నాడు అఖిల్. ఇప్పుడు ఇదే జోష్‌తో తన నెక్స్ట్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.

Akhil Akkineni to do with two heroines in agent movie

ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న ఇద్దరు ముద్దుగుమ్మ‌లు న‌టిస్తార‌ని తెలుస్తోంది. అఖిల్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం మరో హీరోయిన్‌గా తమిళ యువ నటి అతుల్య రవిని ఎంపిక చేశారు. సాక్షికి ఇది తొలి చిత్రం కాగా, అతుల్య ఇంతకుముందు కాదల్ కన్ కట్టుదే, యెమాలి, అడుత సత్తై, నాడోడిగల్ 2 వంటి తమిళ చిత్రాలలో కనిపించింది.

ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఎవ‌రు మొద‌టి హీరోయిన్, రెండో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు ? అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

మమ్ముట్టిపై బుడాపెస్ట్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మమ్ముట్టి ఆర్మీ ఆఫీసర్ గా అఖిల్ కి ఓ మెంటార్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చేఏడాది ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి