
నటుడు ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి సంబంధించిన ఇప్పటివరకు బయటకు రాని అరుదైన ఫొటోలను ఆనంద్ తమ అభిమానులతో పంచుకోవడంతో సోషల్ మీడియాలో అవి విపరీతంగా షేర్ అవుతున్నాయి. విజయ్ దేవకొండ తన వివాహం తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడంతో ఆనంద్ దేవరకొండ ప్రత్యేకంగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఉడయ్‌పూర్‌లో జరిగిన సన్నిహిత వివాహ వేడుకల నుంచి కొన్ని అపురూప క్షణాలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
పూజ, హల్దీ ఫొటోలు..
షేర్ చేసిన ఫోటోలలో ఒక దాంట్లో కొత్త ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ పూజ సందర్భంగా విజయ్, రష్మిక కలిసి కనిపించారు. మరో ఫొటోలో వివాహ మండపం వద్ద విజయ్, ఆనంద్ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. కుటుంబ సభ్యులు గోవర్ధన్ రావు, మాధవి కూడా వేడుకల్లో పాల్గొన్న చిత్రాలు ఉన్నాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆనంద్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా ఆనంద్ దేవరకొండ.. ఈ ఏడాది నువ్వు మరింత సంపూర్ణంగా, ధైర్యంగా, కాన్ఫిడెన్స్‌తో నీ పుట్టినరోజు జరుపుకుంటున్నావు. హ్యాపీ బర్త్‌డే బిగ్ బ్రదర్.. అంటూ భావోద్వేగ సందేశం పెట్టారు. ఈ పోస్ట్‌పై అభిమానులు భారీగా స్పందిస్తూ దేవరకొండ సోదరుల అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు.
అంగరంగ వైభవంగా వివాహం..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తెలుగు సంప్రదాయంతోపాటు కొడవ పద్ధతిలో కూడా వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ జంట వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో భారీ రికార్డులు సృష్టించాయని నివేదికలు పేర్కొన్నాయి.

స్పందించండి