ఆదివారం, జూలై 26, 2026
వినోదం

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న రిలీజ్ కానుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హోమీ అద‌జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్ట‌ర్‌ల‌ను ర‌ష్మిక మందన్న త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?
జూన్ 19, 2026న విడుదల కానున్న ‘కాక్‌టెయిల్ 2’ సినిమా పోస్టర్లు. Photo Credit: Rashmika Mandanna/Instagram.
Shahid Kapoor, Rashmika Mandanna, and Kriti Sanon first look posters for Cocktail 2 movie.
జూన్ 19, 2026న విడుదల కానున్న ‘కాక్‌టెయిల్ 2’ సినిమా పోస్టర్లు. Photo Credit: Rashmika Mandanna/Instagram.

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న రిలీజ్ కానుంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హోమీ అద‌జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్ట‌ర్‌ల‌ను ర‌ష్మిక మందన్న త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో న‌టించిన న‌టీన‌టుల లుక్‌ను రివీల్ చేసింది. ఈ సినిమాకు చెందిన ఫ‌స్ట్ లుక్ మార్చి 18, 2026న కేవ‌లం థియేట‌ర్ల‌లో మాత్ర‌మే రిలీజ్ అవుతుంద‌ని ర‌ష్మిక‌ త‌న పోస్టులో తెలిపింది. కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి జ‌రిగిన అనంత‌రం నిర్వ‌హించిన‌ ఆమె రిసెప్ష‌న్‌కు కాక్‌టెయిల్ 2 చిత్ర బృందం కూడా వ‌చ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

రిసెప్ష‌న్‌కు వ‌చ్చిన కాక్‌టెయిల్ 2 బృందం..

ఉదయపూర్‌లో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత రష్మిక మందన్న హైదరాబాద్‌లో జరిగిన తమ వివాహ రిసెప్షన్‌కు కాక్‌టెయిల్ 2 బృందాన్ని ఆహ్వానించింది. మార్చి 4, 2026న జరిగిన ఆ స్టార్ స్టడెడ్ వేడుకకు కృతి సనన్, హోమీ అదజానియా, మ్యాడాక్ ఫిల్మ్స్ అధిపతి దినేష్ విజన్, ఆయన భార్య ప్రమితా తన్వర్ హాజరయ్యారు. కాక్‌టెయిల్ 2 సినిమా షూటింగ్‌ను నటీనటులు, సిబ్బంది ఈ ఏడాది జనవరిలో పూర్తిచేశారు. ఆ సమయంలో సినిమా ర్యాప్ పార్టీ నుంచి కొన్ని సరదా ఫోటోలను హోమీ అదజానియా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

2024లో విడుదలైన తేరీ బాతోన్ మేన్ ఐసా ఉల్ఝా జియా తర్వాత షాహిద్ కపూర్, కృతి సనన్ కలిసి పనిచేస్తున్న రెండో చిత్రం కాక్ టెయిల్ 2 కాగా హోమీ అదజానియా 2012లో విడుదలైన కాక్‌టెయిల్ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనె, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి