గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Star Actress : స్టైలిష్‏గా స్టెప్పులేస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్..

Star Actress : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు…

Star Actress : స్టైలిష్‏గా స్టెప్పులేస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్..

Star Actress : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, తమన్నా, త్రిష ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చ‌ల్ చేస్తోంది.

పైన ఫోటోలో రెడ్ డ్రెస్‏లో ఎంతో స్టైలిష్‏గా స్టెప్పులేస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తొచ్చిందా..

Star Actress have you identified rashmika mandanna
Star Actress

ఆ చిన్నారి మరెవరో కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కేవలం కెరీర్ ఆరంభించిన 5 ఏళ్లలో పాన్ ఇండియా లెవల్లో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం తన ఇన్ స్టాలో చిన్ననాటి పిక్ షేర్ చేసుకుంది. అందులో స్జేజ్ పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. స్కూల్లో డ్యాన్స్ చేస్తున్న పాటను కనిపెట్టండి.. 2004/2005లో జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే తలపతి విజయ నటిస్తోన్న వరిసు, హిందీలో గుడ్ బై, మిస్టర్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి