
భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని ఆయన చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌ను లాగేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అనేక మంది నెటిజన్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుండగా, ఇది పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులను కలుస్తున్న సమయంలో రోహిత్ శర్మ చేతికి ఉన్న విలాసవంతమైన వాచ్‌ను ఒక యువ అభిమాని తాకేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది. కొందరు సోషల్ మీడియా యూజర్లు అది వాచ్‌ను తస్కరించే ప్రయత్నమని కామెంట్లు చేయగా, మరికొందరు కేవలం ఉత్సాహంలో తాకాడని అభిప్రాయపడ్డారు. అయితే వీడియో వైరల్ కావడంతో రోహిత్ భద్రతపై చర్చ మొదలైంది.
వాచ్ ధర రూ.3.25 కోట్లు..?
రోహిత్ శర్మ ధరించిన వాచ్ విలువ సుమారు రూ.3.25 కోట్లు ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రోహిత్‌కు లగ్జరీ వాచ్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయన ఖరీదైన హుబ్లాట్, ఇతర ప్రీమియం బ్రాండ్ల వాచ్‌లతో కనిపించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు అభిమానులు సెలబ్రిటీల వ్యక్తిగత స్పేస్‌ను గౌరవించాలని పేర్కొనగా, మరికొందరు అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు హద్దులు దాటుతోందని అన్నారు. కొంతమంది మాత్రం వీడియోను నెమ్మదిగా పరిశీలిస్తే అది నిజంగా దొంగతనం ప్రయత్నంలా కనిపించలేదని కూడా కామెంట్లు చేస్తున్నారు.
Rohit Sharma Fans tried to snatch his 3.25 Cr “Giraffe” watch from his wrist. And suddenly he close the mirror. pic.twitter.com/vMIQFxcdxt
— खुर्पा डॉन सनातनी 🚩 (@MemesMandir) May 8, 2026
తరచూ వార్తల్లో రోహిత్..
ఇటీవల ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ శర్మకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులతో సెల్ఫీలు, సరదా సంభాషణలు, మైదానంలో భావోద్వేగ క్షణాలు తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ అభిమాని ఫోన్ ఆఫ్ కావడంతో తో క్యా కరూన్ మై ఫిర్? అంటూ రోహిత్ సరదాగా స్పందించిన వీడియో కూడా వైరల్ అయింది.

స్పందించండి