
ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ శర్మ ధర్మశాలలో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ కోసం ధర్మశాలకు చేరుకుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ ఒక రెస్టారెంట్‌కు వెళ్తుండగా అభిమానులు భారీగా చుట్టుముట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న కొంతమంది విదేశీ టూరిస్టులు రోహిత్ శర్మను గుర్తుపట్టలేకపోయారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వారు అభిమానులను అడిగి ఇతను ఎవరు? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గుర్తింపు ఉన్న బ్యాటర్లలో ఒకరైన రోహిత్‌ను విదేశీయులు గుర్తించకపోవడం నెటిజన్లలో చర్చకు దారితీసింది.
భారీ స్కోరు చేసిన పంజాబ్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే వరుసగా నాలుగు పరాజయాల తర్వాత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి పోటీ స్థాయి స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా (27), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57) దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. ప్రభ్‌సిమ్రన్‌కు ప్రారంభంలోనే జీవనదానం లభించడంతో ముంబై భారీ మూల్యం చెల్లించుకుంది. రెండో ఓవర్‌లో జస్‌ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో నామన్ ధీర్ సులభ క్యాచ్ వదిలేయగా, ఆ అవకాశాన్ని ప్రభ్‌సిమ్రన్ పూర్తిగా వినియోగించుకున్నాడు. బుమ్రాపై వరుస బౌండరీలు బాదుతూ పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్ స్కోరు 55/1కు చేరింది. ముంబైకి తొలి బ్రేక్‌థ్రూ దీపక్ చహర్ అందించాడు. ఐదో ఓవర్‌లో ప్రియాంశ్ ఆర్యాను బౌల్డ్ చేసి పెవిలియన్ పంపించాడు. అనంతరం కూపర్ కానొల్లి (21)తో కలిసి ప్రభ్‌సిమ్రన్ మరో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 12వ ఓవర్‌లో జట్టును 100 పరుగుల మార్క్ దాటించాడు.
The reaction of those foreign tourist girls when Rohit Sharma arrived at the restaurant they were completely stunned by his Aura.🥶🔥 pic.twitter.com/jEIZVQUkoA
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 14, 2026
శార్దూల్ ఠాకూర్ అద్బుతమైన బౌలింగ్..
రఘు శర్మ బౌలింగ్‌లో కానొల్లి తొలి సిక్స్ కొట్టగా, విల్ జాక్స్‌పై వరుస బౌండరీలు సాధించాడు. మరోవైపు ప్రభ్‌సిమ్రన్ దూకుడు పెంచుతూ రఘు శర్మ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. కార్బిన్ బోష్‌పై కూడా మరో సిక్స్ కొట్టాడు. సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత శార్దూల్ ఠాకూర్‌పై బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా మరో సిక్స్ సాధించాడు. అయితే అక్కడి నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి ఓవర్‌లోనే 15 పరుగులు ఇచ్చిన శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా తిరిగి వచ్చి మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు తీశాడు. సెటిల్ అయిన ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్ చేసిన వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4)ను కూడా పెవిలియన్‌కు పంపించాడు. రాజ్ బావా కూడా బౌలింగ్‌లో ప్రభావం చూపించాడు. క్రాస్-సీమ్ డెలివరీతో కానొల్లిని బౌల్డ్ చేసిన అతను, శార్దూల్ బౌలింగ్‌లో సూర్యాంశ్ షెడ్గే క్యాచ్‌ను షార్ట్ మిడ్‌వికెట్ వద్ద అందుకున్నాడు. మరోవైపు శశాంక్ సింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మార్కో జాన్సెన్ కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. 17వ ఓవర్‌లో శార్దూల్ మరో వికెట్ తీయడంతో పంజాబ్ తీవ్ర ఒత్తిడిలో పడింది.
చివరి ఓవర్లలో పంజాబ్ భారీ స్కోరు..
అయితే చివరి మూడు ఓవర్లలో ముంబై బౌలర్లు యార్కర్లు, స్లోవర్ వేరియేషన్లలో తప్పిదాలు చేయడంతో పంజాబ్ తిరిగి బలంగా పుంజుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ కేవలం 17 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. విష్ణు వినోద్, జేవియర్ బార్ట్‌లెట్ కూడా చివర్లో కీలక పరుగులు జోడించారు. ముఖ్యంగా బోష్ వేసిన చివరి ఓవర్‌లో ఇద్దరూ కలిసి 22 పరుగులు రాబట్టారు. బౌండరీ లైన్ వద్ద రెండు క్యాచ్‌లు వదిలేయడం కూడా ముంబైకు భారీ నష్టం కలిగించింది. దీంతో ఈ సీజన్‌లో ఎనిమిదోసారి పంజాబ్ కింగ్స్ 200 పరుగుల మార్క్ దాటింది.

స్పందించండి