బుధవారం, జూలై 8, 2026
వార్తలు

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న చేసిన ప‌నికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌.. వైర‌ల్ వీడియో..!

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల షూటింగ్‌ల‌తో ఎంతో బిజీగా ఉంది. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిన…

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న చేసిన ప‌నికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌.. వైర‌ల్ వీడియో..!

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల షూటింగ్‌ల‌తో ఎంతో బిజీగా ఉంది. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిన ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం 4 బాలీవుడ్ సినిమాల్లో వ‌రుస‌గా న‌టిస్తూనే ఉంది. అందుకు గాను ఈమె ముంబైలో ఏకంగా ఓ ఇంటినే కొనుగోలు చేసింది. ఇక ర‌ష్మిక మంద‌న్న ఎక్క‌డ క‌నిపించినా న‌వ్వుతూ చాలా స‌ర‌దాగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొన‌గా.. అభిమానులు ఫొటోల కోసం ఎగ‌బ‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ ఎంతో ఓపిగ్గా ఆమె వారితో ఫొటోలు దిగింది.

అయితే ర‌ష్మిక మంద‌న్న త‌న ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగిన అనంత‌రం త‌న కార‌వాన్‌లోకి వెళ్తుండ‌గా.. ఓ అభిమాని వ‌చ్చి ఫొటో కావాల‌ని అడిగాడు. అయితే ప‌క్క‌నే ఉన్న సెక్యూరిటీ గార్డు అత‌న్ని వెనక్కి పంపించేయ‌బోయాడు. కానీ ర‌ష్మిక అత‌న్ని వారిస్తూ ఎంతో ఓపిగ్గా త‌న అభిమానితో క‌ల‌సి ఫొటో దిగింది. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక మంద‌న్న త‌న ఫ్యాన్స్‌పై చూపిస్తున్న ఆప్యాయ‌త‌కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమెకు ఓపిక‌కు సహ‌నానికి ఆమెను అభినందిస్తున్నారు. ఫ్యాన్స్‌తో స్టార్స్ ఇలాగే ఉండాలి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Rashmika Mandanna fans are very happy for her gesture video
Rashmika Mandanna

కాగా ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై అనే హిందీ సినిమాల‌తోపాటు సీతా రామ‌మ్ అనే తెలుగు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అలాగే త‌మిళంలో ఈమె విజ‌య్ ప‌క్క‌న న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక త్వ‌ర‌లోనే పుష్ప 2 తోపాటు హిందీలో యానిమ‌ల్ అనే మ‌రో మూవీలోనూ ఈమె న‌టించ‌నుంది.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి