Rashmika Mandanna : పూజ‌లు చేసిన ర‌ష్మిక మంద‌న్న‌.. కార‌ణం ఇదేనా..?

December 24, 2021 11:26 AM

Rashmika Mandanna : చేసింది కొన్ని సినిమాలే అయిన‌ప్ప‌టికీ క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కు భారీ స్థాయిలో పేరు వ‌చ్చింది. దీంతో ఈమె వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది. ఈమె న‌టించిన చిత్రాల్లో చాలా వ‌ర‌కు హిట్ అవుతున్నాయి. దీంతో ఆఫ‌ర్స్ కూడా ఈమెకు బాగానే వ‌స్తున్నాయి. తాజాగా ఈమె న‌టించిన పుష్ప మూవీ విడుద‌ల కాగా.. ఈ మూవీ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో ర‌ష్మిక న‌ట‌న అద్భుత‌మ‌నే చెప్పాలి.

Rashmika Mandanna done pooja with venu swamy

అయితే తాజాగా ర‌ష్మిక మంద‌న్నకు చెందిన పూజ‌ల ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆధ్వ‌ర్యంలో ర‌ష్మిక ప‌లు పూజ‌లు చేసిన‌ట్లు ఫొటోల‌ను చూస్తే తెలుస్తుంది. అయితే ఈ పూజ‌లను ఆమె ఎందుకు చేయించిందో అర్థం కావ‌డం లేదు.

గ‌తంలో స‌మంత‌, చైత‌న్య‌లు విడిపోతార‌ని వేణు స్వామి చెప్పారు. అలాగే కొన్ని విష‌యాల్లోనూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న చెప్పిన‌వి చెప్పిన‌ట్లే జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే త‌న జాత‌కంలోనూ దోషం ఉంద‌ని భావించిన ర‌ష్మిక పూజ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

పెళ్లి చేసుకున్నాక దాంప‌త్య జీవితంలో ఎలాంటి గొడ‌వ‌లు రాకుండా క‌ల‌కాలం క‌ల‌సి ఉండేలా, జాత‌కంలో ఉన్న దోషాల‌ను పోగొట్టుకునేందుకు.. కెరీర్ ప‌రంగా ఇంకా పైకి ఎద‌గాల‌ని చెప్పి.. ర‌ష్మిక పూజ‌లు చేసి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈవిష‌యం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ర‌ష్మిక న‌టిస్తున్న మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై అనే మూవీలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. వ‌చ్చే ఏడాది ఈ మూవీలు రిలీజ్ కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment