వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అత్యంత సానుకూల స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో కూడా సినిమాపై ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. నిర్మాత నాగ్ అశ్విన్ మద్దతుతో, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందడంతో, సినిమా విడుదలకు ముందే ఓటీటీ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.14 కోట్లకు విక్రయమైనట్లు సమాచారం.
మెరుగ్గా లేని వసూళ్లు..
సింగ్ గీతం థియేట్రికల్ రన్ ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం బాక్సాఫీస్ వసూళ్లు సినిమాపై వస్తున్న ప్రశంసలకు పూర్తిస్థాయిలో ప్రతిబింబించలేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇలాంటి కంటెంట్ ఆధారిత చిత్రాలు సాధారణంగా మౌత్ పబ్లిసిటీతో క్రమంగా పుంజుకుంటూ, వీకెండ్‌లలో, తర్వాతి రోజుల్లో మరింత బలమైన ప్రదర్శన కనబరుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్త నటీనటులు, యువ ప్రతిభావంతులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులతోపాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో సినిమాకు మరింత మెరుగైన కలెక్షన్లు వచ్చే అవకాశాలపై సినీ వర్గాల్లో ఆశావహ వాతావరణం నెలకొంది.

స్పందించండి