Chiranjeevi : యాంక‌రమ్మ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి న‌డుము సీన్ చేయ‌నున్న చిరంజీవి.. అభిమానుల‌కి పూన‌కాలేనా..!

April 5, 2022 3:58 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర స్టెప్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో వేస్తే అభిమానుల నుండి ఎంత రెస్పాన్స్ వ‌చ్చిందో మ‌నం చూశాం. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీన్‌ని చిరంజీవి చేయ‌బోతున్నారు. అది ఆషామాషీ సీన్ కాదు. పవన్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీ అయిన ఖుషి సినిమాలోని న‌డుము సీన్. ఓ స‌న్నివేశంలో భూమిక నడుము చూసే సీన్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలెట్. ఖుషి సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ నడుము సీనే. ఇప్పుడు ఆ సీన్‌ని చిరంజీవి హాట్ యాంక‌ర్ శ్రీముఖితో చేయ‌బోతున్నార‌ట‌. ఈ వార్త ప్ర‌స్తుతం సెన్సేష‌న్‌గా మారింది.

Chiranjeevi  to do Pawan Kalyan Khushi movie scene with Anchor Sreemukhi
Chiranjeevi

చిరంజీవి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్ భోళాశంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోనే చిరు – శ్రీముఖి మీద ఖుషి బొడ్డు సీన్ రిపీట్ చేస్తున్నార‌ట‌. అయితే ఈ రీమిక్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంద‌ట‌. నువ్వు నా బొడ్డు చూశావ్ అని శ్రీముఖి అంటే.. అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది, అన్నీ ముడతలేగా.. అని మెగాస్టార్ అంటారు. ఈ విధంగా వీరి మ‌ధ్య ఈ సీన్ చాలా ఫ‌న్నీగా ప్లాన్ చేశార‌ట‌. ఈ సినిమా చెల్లి సెంటిమెంట్‌తో తెర‌కెక్కుతోంది. చిరు ప‌క్క‌న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా క‌నిపిస్తోంది.

ఇక ప్ర‌స్తుతం చిరు న‌టించిన ఆచార్య సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, వాల్తేరు వీర‌య్య లైన్లో ఉన్నాయి. ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న నేప‌థ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 14న సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ట్రైల‌ర్‌తో మూవీపై అంచ‌నాలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment