గురువారం, జూన్ 11, 2026
వినోదం

రామ్ చరణ్ ‘పెద్ది’ క్లైమాక్స్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆసక్తికర వ్యాఖ్యలు!

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చి బాబు సానా తాజాగా గ్రేట్ ఆంధ్రా కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన‌ విషయాలను వెల్లడించారు. సిరాశ్రీతో జరిగిన ఈ సంభాషణలో పెద్ది క్లైమాక్స్‌పై వచ్చిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

రామ్ చరణ్ ‘పెద్ది’ క్లైమాక్స్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆసక్తికర వ్యాఖ్యలు!
'పెద్ది' సినిమా విశేషాలను పంచుకుంటున్న దర్శకుడు బుచ్చిబాబు సానా. Photo Credit: Ram Charan/X.
Director Buchi Babu Sana talking about Ram Charan's Peddi movie climax.
‘పెద్ది’ సినిమా విశేషాలను పంచుకుంటున్న దర్శకుడు బుచ్చిబాబు సానా. Photo Credit: Ram Charan/X.

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చి బాబు సానా తాజాగా గ్రేట్ ఆంధ్రా కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన‌ విషయాలను వెల్లడించారు. సిరాశ్రీతో జరిగిన ఈ సంభాషణలో పెద్ది క్లైమాక్స్‌పై వచ్చిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉప్పెన సినిమాలోలా పెద్దిలో కూడా క్లైమాక్స్ దగ్గర షాక్ ఫ్యాక్టర్ ఉంటుందా? అని అడిగినప్పుడు బుచ్చిబాబు మొదట విషయం మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే అదే ప్రశ్నను మరోసారి స్పష్టంగా అడగడంతో ఆయన చిరునవ్వుతో సినిమా చూస్తే తెలుస్తుంది అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో చిత్రంలో చివర్లో ఓ పెద్ద సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చినట్టైంది.

ఉప్పెన‌లా క్లైమాక్స్ ఉంటుందా..?

అలాగే ఉప్పెన హీరోలా పెద్ది సినిమాలో కూడా హీరో ఏదైనా అవయవాన్ని కోల్పోతాడా? అనే ప్రశ్నకు కూడా బుచ్చిబాబు నేరుగా సమాధానం చెప్పకుండా నవ్వుతూ దాటవేశారు. దీంతో కథలో ఎమోషనల్ ట్విస్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు మాట్లాడిన తీరు, సినిమాకు ప్లాన్ చేస్తున్న పబ్లిసిటీ స్ట్రాటజీలు, గాయాలున్నప్పటికీ రిస్కీ షాట్లు చేసిన రామ్ చరణ్ ధైర్యం గురించి కూడా బుచ్చిబాబు మాట్లాడారు. సెట్స్‌లో రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిన తర్వాత చిరంజీవి ఎలా స్పందించారన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా..

కాగా ఈ ఇంటర్వ్యూ సినిమా అభిమానులకు ఆసక్తికర అంశాలతో నిండిపోయింది. పెద్దిపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచేలా ఈ సంభాషణ సాగింది. ఇక ఈ మూవీని జూన్ 4న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుండ‌గా, చిత్రం ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా మారింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల‌ను వేదిక‌గా చేసుకుని చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ టూర్ ప్లాన్ ను కూడా రిలీజ్ చేసింది. అయితే పెద్ది సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుంద‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి