గురువారం, జూన్ 11, 2026
వినోదం

అల్లు అర్జున్ ‘రాకా’ రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ ఎపిక్ రాకా విడుదల తేదీపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2027 డిసెంబర్ 2న థియేటర్లలోకి వచ్చే అవకాశముందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

అల్లు అర్జున్ ‘రాకా’ రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?
దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమా అప్‌డేట్స్. Photo Credit: Allu Arjun/X.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ ఎపిక్ రాకా విడుదల తేదీపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2027 డిసెంబర్ 2న థియేటర్లలోకి వచ్చే అవకాశముందని ఊహాగానాలు జోరందుకున్నాయి. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, పుష్ప 2 సంచలన విజయానంతరం అల్లు అర్జున్ నటిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్న ఈ సినిమాకు విస్తృత స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా మారనున్నాయి. ఈ చిత్రంలో దీపికా ప‌దుకునె, మృణాల్ ఠాకూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, జాన్వీ క‌పూర్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా అల్లు అర్జున్, దీపికా పదుకొనె పేర్లను మాత్రమే ధ్రువీకరించింది.

డిసెంబ‌ర్ 2027పై ఊహాగానాలు..

గతేడాదికిపైగా ముంబైలో ఈ సినిమా కీలక షెడ్యూళ్ల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల కథనాల ప్రకారం, షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం భారీ స్థాయిలో చేపట్టనున్న పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు మరో 10 నెలల సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఈ కారణంగానే 2027 డిసెంబర్ విడుదల తేదీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయని సమాచారం. డిసెంబర్ నెల అల్లు అర్జున్‌కు అదృష్టాన్ని తీసుకొచ్చిన నెలగా అభిమానులు భావిస్తున్నారు. పుష్ప ది రైజ్‌, పుష్ప 2 రెండు చిత్రాలు కూడా హాలిడే సీజన్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. దీంతో అదే సెంటిమెంట్‌ రాకాకు కూడా కొనసాగుతుందేమోనన్న ఆశతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

కాగా అల్లు అర్జున్ ఇటీవ‌ల త‌న బావ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన పెద్ది సినిమాను సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. పెద్ది సినిమా చ‌ర‌ణ్‌కు జీవితాంతం గుర్తుండిపోతుంద‌ని, ఈ సినిమాతో ఆయ‌న‌లోని మరో న‌టున్ని ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు వెలికి తీశార‌ని అన్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద చిత్రం విజ‌య‌ప‌థంలో దూసుకెళ్తుండ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి