గురువారం, జూన్ 11, 2026
వినోదం

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేసిన అల్లు అర్జున్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, అయాన్ తన చిలిపి అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!
తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో పంచుకున్న ఐకాన్ స్టార్. Photo Credit: Allu Arjun/Instagram.
Allu Arjun hugging his son Allu Ayaan on his birthday.
తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో పంచుకున్న ఐకాన్ స్టార్. Photo Credit: Allu Arjun/Instagram.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేసిన అల్లు అర్జున్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, అయాన్ తన చిలిపి అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నాలుక బయట పెట్టి పీస్ సైన్ చూపిస్తూ కనిపించిన అయాన్ ఫొటోలో హైలైట్‌గా నిలిచాడు. అదే సమయంలో తన కుమారుడిని ప్రేమగా ఆలింగనం చేస్తున్న అల్లు అర్జున్ చిరునవ్వుతో కనిపించారు. ఈ ఫోటోకు క్యాప్షన్‌గా త‌న‌ జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అని, హ్యాపీ బర్త్‌డే నా చిన్నిబాబు అంటూ అల్లు అర్జున్‌ తన ప్రేమను వ్యక్తపరిచారు.

లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీతో బిజీ..

ఇక వృత్తి పరంగా చూస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. తాత్కాలికంగా AA23 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ద్వారా భారీ విజయాలు సాధించిన ఈ దర్శకుడితో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో పుష్ప 2: ది రూల్ చిత్రంలో తన నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ విజయాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

పుష్ప 3వ పార్ట్ ఉంటుందా..?

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2024లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. 2021లో వచ్చిన పుష్ప‌: ది రైజ్ కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో ర‌ష్మిక మంద‌న్న‌, ఫ‌హాద్ ఫాసిల్‌, జ‌గ‌ప‌తి బాబు, సునీల్‌, రావు ర‌మేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఫ్రాంచైజ్‌కు మూడో భాగం కూడా రావొచ్చని సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి