Latest News
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. మార్చి 13, 2026 నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సినిమా గత ఫిబ్రవరి నెలలో 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది.
విడాకుల గురించి వద్దు.. మహిళల కోసం విజయ్ 12 వరాలు! ఎన్నికల వేళ సంచలనం.
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ప్రజల సంక్షేమంపై దృష్టి పెడదామని నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ అన్నారు.
అహ్మదాబాద్‌లో పరుగుల జాతర.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పిచ్ రిపోర్ట్ ఇదే!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కోసం ఎరుపు, నలుపు మట్టితో కూడిన మిశ్రమ పిచ్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ఇంట్లోనే ఉంటానంటూ విజయ్ భార్య సంగీత పిటిషన్.. కోర్టులో కీలక మలుపు!
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు దాంపత్య గృహంలో నివసించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ తాజా పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు.
అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్‌లో చోటు దక్కేనా?
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో వరల్డ్ రికార్డ్.. ఒకేసారి 6.52 కోట్ల మంది వీక్షణ!
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ లో ఒకేసారి గరిష్టంగా 6.52 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్ ఈవెంట్‌లలో అత్యధిక డిజిటల్ పీక్ కన్కరెన్సీగా నమోదు అయింది.

















