Latest News
వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.
ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహించనున్నారు. మార్చి 15, 2026 ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. 98వ అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డ్స్ 2026 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు. ప్రతి రాష్ట్రం తనకంటూ ప్రత్యేక రుచులు, వంటకాలతో ప్రసిద్ధి చెందిందని, ఒకే ఒక్క వంటకం ద్వారా భారతీయ ఆహార అనుభవాన్ని నిర్వచించడం దాదాపు అసాధ్యమని అన్నారు.
హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ చారిత్రాత్మక విజయాన్ని సంబరంగా జరుపుకున్న అభిమానులలో మోడల్ మహీకా శర్మ కూడా ఒకరు.
అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో విలాసవంతమైన కానుకతో తన తల్లి నిర్మల అల్లును సర్‌ప్రైజ్ చేశారు.
ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ ఆదివారం, మార్చి 8, 2026న ప్రకటించింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు ఈ ప్రకటన వెలువడింది.
త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నా పేరు, ఫొటోను చివరి నిమిషంలో ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు, అతని సహాయకుడి ద్వారా నిర్వాహకులు చేర్చినట్లు నాకు సమాచారం ఇచ్చారు.
బెల్లంకొండ ఇంట్లో పెళ్లి సందడి.. వైభవంగా శ్రీనివాస్ నిశ్చితార్థం..
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి 8, 2026) హైదరాబాద్‌లో జరిగింది. ఇటీవల టాలీవుడ్ హీరోలు ఒకరి తరువాత ఒకరు పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

















