
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు బహుమతిగా అందించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు రికార్డు విజయం అందించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 21 బంతుల్లో అద్భుతంగా 52 పరుగులు సాధించాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ కార్యక్రమంలో ఈ ఇద్దరూ ఒకే వేదికపై పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తన కోసం ఒక బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అభిషేక్‌ను కోరాడు. అయితే అందుకు ప్రతిగా ప్రపంచకప్ సమయంలో ఉపయోగించిన బ్యాట్‌ను నేనే మీకు బహుమతిగా ఇస్తానని క్రికెటర్ తెలిపాడు. వెంటనే అక్షయ్ కుమార్ అభిషేక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
🚨 AKSHAY KUMAR ASKS ABHISHEK SHARMA FOR AN AUTOGRAPH 🚨
Akshay Kumar🎙️: Akshay has a request. He wants Abhishek to sign on it so he can take it home.
Abhishek Sharma🎙️: I think I’ll give him my bat only, the one I played for the World Cup with. 🤯pic.twitter.com/HriHDjrxFy
— Sam (@Cricsam01) March 15, 2026
అభిషేక్‌ను ప్రశంసించిన సంజు..
కాగా భారత జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన ఓపెనింగ్ భాగస్వామి అభిషేక్ శర్మను ప్రశంసించాడు. తమ భాగస్వామ్యం చాలా సహజంగా, సమతుల్యంగా సాగుతుందని పేర్కొన్నాడు. తమ జోడీని ఫైర్ అండ్ ఫైర్ గా అభివర్ణించాడు. ఇద్దరమూ వరుసగా దాడిని ముందుకు నడిపించే విధంగా ఆడతామని చెప్పారు. కేరళ-పంజాబ్ స్నేహం తమ మధ్య ఉన్న అవగాహనకు బలంగా నిలుస్తుందని సంజూ శాంసన్ తెలిపాడు. అభిషేక్ ధైర్యం, స్థిరమైన స్వభావాన్ని సంజు ప్రశంసించాడు. మైదానంలోనూ, మైదానం బయట కూడా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తున్నానని అన్నాడు.
ఇక ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లపై దూకుడుగా ఆడారు. ఓపెనింగ్ భాగస్వామ్యంగా ఇద్దరూ కలిసి 98 పరుగులు జోడించి పవర్‌ప్లేలో భారత్‌కు అద్భుత ఆరంభాన్ని అందించారు. వారి ఆ అద్భుత ప్రారంభం ఫైనల్‌లో భారత్ 255 పరుగుల భారీ స్కోర్ సాధించడానికి దోహదపడింది.












