Vijayashanthi : తెలంగాణలో బీజేపీ, తెరాస పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యాసంగి వరిధాన్యం కొనాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుండగా.. కేంద్రం మాత్రం బాయిల్డ్ రైస్‌ను కొనేది లేదని, సాధారణ రైస్‌ను కొంటామని తేల్చి చెప్పింది. దీంతో తెరాస నాయకులు 20వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీజేపీ నాయకులు రాష్ట్రంలో తిరగకుండా సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని రాములమ్మ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని “(K)కోతి (C)చేష్టల (R)రావు” గారి రాజ్యం తీరుగా చేసి గత్తర బిత్తర పరిపాలన నడిపిస్తున్నది మనందరం చూస్తూనే ఉన్నాము.”
“ఇక శ్రీరంగం కోవెల గజరాజు మొట్టికాయలు కొట్టినంకన్నా జర్రంత సక్కగైతదేమో అనుకుంటే… అట్లగాక రాష్ట్రానికి వచ్చిన వెంటనే బీజేపీని అడ్డుకోండ్రి…. ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను తిరగనియ్యకండ్రి అంటూ సీఎం స్థాయి కూడా మరచి “(K)కొండెంగె (C)చిందుల (R)రావు” గారి రాజ్యం లెక్క మరింత తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నరు.”
“ఇగ ప్రజల భయానికి జిల్లా పర్యటనలను మరోసారి కుంటి సాకులు చూపి, తప్పించుకుని ఎప్పటి లెక్కనే మోసపు మాటలు చెబ్తున్నరు. ఈ వింత, విపరీత, విచిత్ర విన్యాసాలన్నీ గమనిస్తున్న ప్రజలు సరైన సమయం కోసం హుజురాబాద్ తీరులో ఎదురు చూస్తున్నరు..” అంటూ విజయశాంతి కామెంట్ చేశారు. ఈ మేరకు ఆమె పోస్టు పెట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…