వినోదం

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

98వ ఆస్కార్ వేడుకలో సందడి చేయనున్న ప్రియాంక చోప్రా. Photo Credit: press.oscars.org

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 15న నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 15, 2026 ఆదివారం ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. 98వ అకాడ‌మీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డ్స్ 2026 కార్య‌క్ర‌మాన్ని అట్టహాసంగా నిర్వ‌హించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుండ‌గా, ప్ర‌ముఖ సినీ న‌టులు, ద‌ర్శ‌కులు, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. ఆస్కార్ అవార్డ్స్ 2026 కార్య‌క్ర‌మాన్ని ఎప్ప‌టిలాగే డాల్బీ థియేట‌ర్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఎంతో కాలంగా ఇదే వేదిక‌పై ఆస్కార్ అవార్డుల‌ను అందిస్తూ వ‌స్తున్నారు. ఈ వేడుక‌ల‌ను ప్రేక్ష‌కులు టీవీ, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో వీక్షించ‌వ‌చ్చు. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ కార్య‌క్రమాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నారు.

ప్ర‌జెంట‌ర్‌గా ప్రియాంక చోప్రా..

ఇక ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డులు ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రిలోనూ ఉత్సాహాన్ని క‌లిగిస్తున్నాయి. త‌మ అభిమాన సినీ న‌టులు, ద‌ర్శ‌కులు అవార్డుల‌ను అందుకుంటుంటే చూడాల‌ని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి భార‌త ప్రేక్ష‌కుల‌కు ఈ కార్య‌క్ర‌మం ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే న‌టి ప్రియాంక చోప్రా ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప్రియాంక చోప్రాతోపాటు ప్ర‌ముఖ న‌టులు రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్‌, అన్నే హాత్ వే కూడా ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జెంట‌ర్లుగా పాల్గొంటున్నారు. మార్చి 15, 2026 ఆదివారం జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని అనుకున్న స‌మ‌యం క‌న్నా ఒక గంట ముందుగానే నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 7 గంట‌ల‌కు కార్య‌క్ర‌మం ప్రారంభం అవుతుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మార్చి 16న ఉద‌యం 4:30 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం అవుతుంది.

స్టార్ మూవీస్‌, జియో హాట్ స్టార్‌ల‌లో..

అమెరికాలో ఉన్న ప్రేక్ష‌కులు ఈ కార్య‌క్ర‌మాన్ని ఏబీసీ చాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షించ‌వ‌చ్చు. ఇక భార‌త్‌లో స్టార్ మూవీస్ చాన‌ల్‌తోపాటు జియో హాట్ స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. అయితే కార్యక్ర‌మం ముగిసిన త‌రువాత కూడా దీన్ని జియో హాట్ స్టార్‌లో ఆన్ డిమాండ్ రూపంలోనూ వీక్షించ‌వ‌చ్చు. ఇక ఈ ఏడాది ఆస్కార్ నామినేష‌న్ల‌లో రియ‌న్ కూగ్ల‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సిన్న‌ర్స్ చిత్రం 16 నామినేష‌న్ల‌తో అగ్ర స్థానంలో నిలిచింది. దీంతో గ‌తంలో 14 నామినేష‌న్లతో ఉన్న రికార్డును ఇది అధిగ‌మించింది. అలాగే హామ్‌నెట్‌, సెంటిమెంల్ వాల్యూ, వ‌న్ బ్యాటిల్ ఆఫ్ట‌ర్ అన‌ద‌ర్‌, ఫ్రాంకెన్‌స్టైన్ చిత్రాలు కూడా ఈసారి బెస్ట్ ఫిలిం విభాగంలో పోటీ ప‌డుతున్నాయి.

పోటాపోటీగా నామినేట్‌..

ఉత్త‌మ ద‌ర్శ‌కుడి విభాగంలో రియ‌న్ కూగ్ల‌ర్ (సిన్న‌ర్స్) నామినేట్ కాగా, పాల్ థామ‌స్ ఆండ‌ర్స‌న్ (వ‌న్ బ్యాటిల్ ఆఫ్ట‌ర్ అన‌ద‌ర్‌) కూడా ఈ విభాగంలో నామినేట్ అయ్యారు. ఈ చిత్రం ఉత్త‌మ చిత్రంగా నిలిచే అవ‌కాశం కూడా ఉంద‌ని భావిస్తున్నారు. అలాగే క్లోయ్ జావో (హామ్ నెట్‌), జోయాకిమ్ ట్రియ‌ర్ (సెంటిమెంట‌ల్ వాల్యూ), జోష్ సాఫ్డీ (మార్జీ సుప్రీం) కూడా ఉత్త‌మ ద‌ర్శ‌కుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ఇక ఉత్త‌మ న‌టుడి విభాగంలోనూ పోటీ నెల‌కొంది. వ‌న్ బ్యాటిల్ ఆఫ్ట‌ర్ అన‌ద‌ర్ చిత్రానికి లియోనార్డో డికాప్రియో నామినేట్ కాగా, సిన్న‌ర్స్ చిత్రానికి మైకేల్ బి.జోర్డాన్‌, మార్టీ సుప్రీం కు టిమోతీ షాల‌మేట్‌, బ్లూ మూన్‌కు ఈథ‌న్ హాక్‌, ది సీక్రెట్ ఏజెంట్‌కు వాగ్న‌ర్ మౌర్ కూడా ఈ పోటీలో నిలిచారు.

ఉత్త‌మ న‌టి విభాగంలోనూ ప‌లువురు న‌టుల మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఎమ్మా స్టోర్‌, జెస్సీ బక్లీ (హామ్‌నెట్‌), రోజ్ బ‌ర్న్ (ఇన్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐడ్ కిక్ యు), రెనేట్ రైన్స్ వే (సెంటిమెంట‌ల్ వాల్యూ), కేట్ హ‌డ్స‌న్ (సాంగ్ సంగ్ బ్లూ) ఈ విభాగంలో పోటీప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM