వినోదం

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

‘డెకాయిట్’ చిత్ర విజయానికి కారకులైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్న హీరో అడివి శేష్. Photo Credit: Adivi Sesh/Instagram.

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు అడివి శేష్ అన్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన డెకాయిట్ సినిమా ఇటీవ‌ల రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు రూ.50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింద‌ని చిత్ర‌వ‌ర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో డెకాయిట్ మూవీ థాంక్యూ మీట్‌ను నిర్వ‌హించ‌గా అందులో పాల్గొన్న శేష్ మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చిన ఓ అభిమాని త‌న‌తో చెప్పిన మాట‌లు త‌న‌ను ఎంత‌గానో ప్రేర‌ణ క‌లిగించాయ‌ని, సినిమాల కోసం తాను ఇంకా క‌ష్ట‌ప‌డాల‌ని అప్పుడే త‌న‌కు అనిపించింద‌ని శేష్ అన్నారు. అలాగే ఈ మూవీ గురించి న‌టుడు రామ్ చ‌ర‌ణ్ పెట్టిన పోస్టును కూడా శేష్ ప్ర‌స్తావించారు.

సినిమాల కోసం ఇంకా క‌ష్ట‌ప‌డాలి..

త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చిన ఓ అభిమాని ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన‌ప్పుడు తాను అంత‌కు ముందు న‌టించిన మేజ‌ర్ మూవీని ఆ అభిమాని చూసిన‌ట్లు తెలిపాడ‌ని అన్నారు. అప్ప‌ట్లో అత‌ను గాయాల‌కు గురై హాస్పిట‌ల్‌లో చేరాడ‌ని, కొంద‌రు అత‌నిపై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, బ‌య‌ట‌కు వెళ్లాలంటే భ‌య‌మేసింద‌ని ఆ అభిమాని చెప్పాడ‌ని శేష్ తెలిపారు. అయితే శేష్ న‌టించిన మేజ‌ర్ సినిమా చూసిన త‌రువాత అత‌నికి ధైర్యం వ‌చ్చింద‌ని త‌న‌కు చెప్పాడ‌ని శేష్ అన్నారు. ఆ త‌రువాత ఆ అభిమాని ధైర్యంగా జీవిస్తున్న విష‌యాన్ని త‌న‌కు తెలియ‌జేశాడ‌ని అన్నారు. ఆ అభిమాని త‌న‌తో త‌న సినిమాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యాడ‌ని, అయితే ఆ క్ష‌ణ‌మే త‌న‌కు సినిమాల‌ను అస‌లు ఎందుకు చేస్తున్నాన‌ని త‌ట్టింద‌ని, సినిమాల గురించి ఇంకా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తాను భావిస్తున్నాన‌ని అన్నారు.

సినిమా న‌చ్చ‌క‌పోతే ప‌క్క‌న పెడుతున్నారు..

ఇప్ప‌టి ప్రేక్ష‌కుల అభిరుచులు మారిపోయాయ‌ని, సినిమా న‌చ్చితే భాష‌తో సంబంధం లేకుండా ఆద‌రిస్తున్నార‌ని, అయితే సినిమా న‌చ్చితే న‌టీన‌టుల గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఎంత సీనియ‌ర్ న‌టుల సినిమాలు అయినా స‌రే న‌చ్చ‌క‌పోతే ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని శేష్ అన్నారు. అలాగే సినిమా రిలీజ్ స‌మ‌యంలో న‌టుడు రామ్ చ‌ర‌ణ్ త‌న మూవీ గురించి పెట్టిన పోస్టు చూసి షాక‌య్యాన‌ని, ఆయ‌న త‌మ సినిమా చూసి బాగుంద‌ని తెలిపార‌ని అన్నారు. త‌మ సినిమాను ఆద‌రించిన ఆడియ‌న్స్‌, మీడియా, ఇండ‌స్ట్రీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని శేష్ పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM