వినోదం

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విడుదల సందర్భంగా తన మనసులోని మాటను పంచుకున్న కృతి శెట్టి. Photo Credit: Krithi Shetty/Instagram.

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి కామెంట్లే చేస్తే బాధ‌గా ఉంటుంద‌ని న‌టి కృతి శెట్టి విచారం వ్య‌క్తం చేసింది. ఆమె తాజాగా న‌టించిన ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఏప్రిల్ 10, 2026న థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో ఆమెకు జోడీగా న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ న‌టించాడు. న‌టి న‌య‌నతార ఈ సినిమాను నిర్మించ‌గా ఆమె భ‌ర్త‌, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కృతి శెట్టి కీల‌క వివ‌రాల‌ను వెల్ల‌డించింది. సినిమా హిట్ అవ‌డం, ఫ్లాప్ అవ‌డం త‌న‌కు ఎలా తెలుస్తుంద‌ని, అది త‌న చేతుల్లో ఉండ‌ద‌ని, సినిమాలో యాక్టింగ్ ప‌రంగా తన‌ను తాను నిరూపించుకుంటే చాల‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. కొత్త సినిమా వ‌స్తుందంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువైపోతాయ‌ని, కానీ ఆ కామెంట్స్‌ను పట్టించుకోన‌ని, ఎల్ల‌ప్పుడూ పాజిటివ్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని తెలిపింది.

ప్ర‌తి సినిమాకు వంద శాతం క‌ష్ట‌ప‌డ‌తా..

ఈ సినిమాలో తాను న‌టిస్తున్నాను క‌నుక సినిమా డౌటే అని చాలా మంది నెగెటివ్ కామెంట్లు చేశార‌ని కృతి శెట్టి వాపోయింది. అయితే త‌న‌ను ఎంత‌గానో అభిమానించే తెలుగు ప్రేక్ష‌కులు త‌న గురించి ఇలా అన‌డం త‌న‌కు చాలా బాధ క‌లిగిస్తుంద‌ని ఆమె పేర్కొంది. ఎప్ప‌టిలాగే ప్ర‌తి సినిమాకు తాను త‌న వంతు కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేసింది. ఓ న‌టిగా తాను చేసే ప్ర‌తి సినిమాకు వంద శాతం క‌ష్ట‌ప‌డ‌తాన‌ని, అయితే సినిమాల‌కు స‌రైన బాక్సాఫీస్ ఫ‌లితాలు రాలేద‌ని తెలిపింది. దీని వ‌ల్ల త‌న హార్డ్ వ‌ర్క్ గురించి కాకుండా త‌న‌కు ల‌క్ లేద‌ని కామెంట్లు చేస్తున్నార‌ని తెలిపింది. ఇలా చేయ‌డం త‌న‌కు బాధ‌గా ఉంటుంద‌ని, సినిమా రిజ‌ల్ట్ అనేది త‌న చేతిలో ఉండ‌ని చెప్పింది. అయితే అలాంటి కామెంట్స్ వ‌ల్ల ఒక అవ‌కాశం మిస్ కావ‌డ‌మ‌నేది బాధ‌గా ఉంటుంద‌ని పేర్కొంది.

పాజిటివ్ థింకింగ్ ముఖ్యం..

ఇక ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్ర విశేషాల‌ను కూడా కృతి శెట్టి పంచుకుంది. ఈ సినిమాలో తాను ధీమా అనే పాత్ర‌లో న‌టించాన‌ని, త‌న‌కు నోమోఫోబియా ఉంటుంద‌ని, దీని వ‌ల్ల చేతిలో ఫోన్ లేక‌పోతే భ‌యం వేస్తుంద‌ని తెలిపింది. సోష‌ల్ మీడియాకు బానిస అయిన ఓ అమ్మాయి పాత్ర‌లో యాక్ట్ చేయ‌డం త‌న‌కు కొత్త‌గా అనిపించింద‌ని, ఈ సినిమాతో న‌టి న‌య‌న‌తార‌తో మంచి రిలేష‌న్ ఏర్ప‌డిన‌ట్లు తెలిపింది. ఒక‌సారి ఓ స‌మ‌స్య వ‌చ్చి ఆమెకు ఫోన్ చేయ‌గానే, వెంట‌నే లిఫ్ట్ చేశార‌ని, ఆమె మంచి స‌ల‌హా ఇచ్చార‌ని తెలియ‌జేసింది. అయితే త‌న సినిమాల‌పై నెగెటివ్‌గా ట్రోల్స్ చేసేవారు నెగెటివ్‌గానే ఆలోచిస్తుంటార‌ని, కానీ మ‌నిషికి పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్య‌మ‌ని, తాను అదే ధోర‌ణిలో ఉంటాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతం త‌న ఫోక‌స్ అంతా యాక్టింగ్‌పైనే ఉంద‌ని, 5 లేదా 10 ఏళ్ల త‌రువాత త‌నకు న‌చ్చిన ఓ వ్య‌క్తితో డేటింగ్ చేసి ఆ వ్య‌క్తినే వివాహం చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ప్ర‌స్తుతం తెలుగులో అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాన‌ని, త‌మిళంలో మ‌రో మూవీకి సైన్ చేశాన‌ని, అలాగే హిందీ మూవీల్లోనూ న‌టించేందుకు చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆమె తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM