వినోదం

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విజయ్ ‘జననాయకన్’ మూవీ లీక్డ్ ఫుటేజ్ వార్త. Photo Credit: Imme/X.

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు గురైన ఈ సినిమా, సెన్సార్ అనుమతి పొందకముందే చిత్రంలోని కొన్ని భాగాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో కొత్త సమస్య బారిన ప‌డింది. ముఖ్యంగా ఈ చిత్రం రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావచ్చనే నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారింది. సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న పోస్టులు, మీడియా క‌థ‌నాల ప్ర‌కారం ఈ చిత్రానికి చెందిన 5 నిమిషాల‌ 31 సెకన్ల నిడివి గల క్లిప్ లీక్ అయింది. ఈ వీడియో ఎక్స్‌, యూట్యూబ్, రెడిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతోంది. లీక్ అయిన ఫుటేజ్‌లో టైటిల్ క్రెడిట్స్, విజయ్ ప్రవేశ సన్నివేశం, అలాగే ఒక యాక్షన్ ఫైట్ సీన్ ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల‌ను తొలగించినప్పటికీ ఆ క్లిప్ ఇంకా విస్తృతంగానే వైర‌ల్ అవుతోంది.

ఎలా చేసి ఉంటారు..?

ఈ వీడియోను థియేటర్‌లో జరిగిన టెస్ట్ స్క్రీనింగ్ సమయంలో లేదా ఎడిటింగ్ దశలో రికార్డ్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్లిప్ చివర్లో ఒక వ్యక్తి వీడియోను పాజ్ చేస్తున్నట్లు కనిపించిందని మీడియా క‌థ‌నాలు చెబుతున్నాయి, ఇది అంతర్గతంగా జ‌రిగిన లీక్ అయి ఉండొచ్చనే అనుమానాలకు దారితీసింది. అయితే ఈ ఫుటేజ్ ఎలా లీక్ అయిందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ ఘటనపై అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. లీక్ అయిన వీడియోను షేర్ చేయ‌వద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక మంది సోషల్ మీడియాలో చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక ఫ్యాన్ అకౌంట్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదైందని హెచ్చరిస్తూ, వీడియోను షేర్ చేసే వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎవ‌రూ షేర్ చేయ‌కండి: సీబీ స‌త్య‌రాజ్‌

నటుడు సీబీ సత్యరాజ్ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. జన నాయకన్ చిత్రానికి సంబంధించిన ఫుటేజ్ లీక్ అయిందని విని షాక్‌కు గురయ్యాన‌ని అన్నారు. ఒక సినిమాను తీయ‌డంలో ఎంత డబ్బు, కష్టం, శ్రమ ఉంటుందో దీన్ని చేసిన వారు అర్థం చేసుకోవాల‌ని అన్నారు. ఈ వీడియోలను చూడకుండా, షేర్ చేయ‌కుండా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాన‌ని తెలిపారు. చిత్ర నిర్మాత జి. ధనంజేయన్ ఈ లీక్‌ను అసహ్యకరమైనదిగా అభివర్ణిస్తూ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయ్ చివరి సినిమా కావచ్చనే నేపథ్యంలో దీన్ని లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే భావాన్ని పంచుకుంటూ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రూ.400-రూ.500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ఒక్కరాత్రిలో లీక్ కావడం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, మొత్తం బృందానికి కఠిన సమయమ‌ని అన్నారు. ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న ఈ చిత్రంపై మరింత జాగ్రత్త అవసరమ‌వుతోంద‌ని అన్నారు.

ఆల‌స్య‌మ‌వుతున్న విడుద‌ల‌..

ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించ‌గా, ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తొలుత జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. అనంతరం ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ అది కూడా జరగలేదు. ఈ ఆలస్యంపై నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికేషన్ పొందకపోవడం, విడుదల తేదీ ఖరారు కాకపోవడం న‌డుమ‌ ఈ లీక్ ఘటన జన నాయకన్ చిత్రానికి మరో పెద్ద సమ‌స్య‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM