క్రికెట్

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

లక్నో సూపర్ జెయింట్స్‌పై 49 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ. Photo Credit: BCCI/X.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు చేరుకునే వ‌ర‌కు పోటీ మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంద‌ని టీమిండియా క్రికెట‌ర్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ల‌క్నో సూప‌ర్ జ‌యాంట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 49 ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించిన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఆ మ్యాచ్ స్లో పిచ్ కార‌ణంగా చాలా నెమ్మ‌దిగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో ప్లేయ‌ర్లు బ్యాటింగ్‌లో త‌డ‌బ‌డ్డారు. దీంతో త‌మ ముందు ల‌క్నో నిలిపిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల తేడాతో ఛేదించింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వ‌చ్చిన కోహ్లి అంత‌కు ముందు ఫీల్డింగ్ స‌మ‌యంలో గ్రౌండ్‌లో క‌నిపించ‌లేదు. దీంతో అత‌ను మ్యాచ్‌లో ఆడ‌తాడా, లేదా అని ఫ్యాన్స్ సందేహం వ్య‌క్తం చేశారు. అయితే ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ కోహ్లిని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బరిలోకి దింపింది. దీంతో కోహ్లి నేరుగా బెంగ‌ళూరు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కే వ‌చ్చాడు. అయితే కోహ్లి అలా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రావ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది.

కోహ్లి అందుక‌నే ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చాడు..

ఏప్రిల్ 12, 2026న ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఆతిథ్య జ‌ట్టుతో జ‌రిగిన ఐపీఎల్ 2026 టోర్నీ 20వ మ్యాచ్‌లో కోహ్లి గాయ‌ప‌డ్డాడు. ఆ మ్యాచ్‌లో బెంగ‌ళూరు భారీ స్కోరు చేసి విజ‌యం సాధించింది. అయితే కోహ్లి మోకాలికి గాయ‌మై నొప్పి వ‌చ్చింది. దీంతో అత‌ను మ్యాచ్ స‌మ‌యంలో ఇబ్బంది ప‌డ్డాడు. అయితే తాజాగా ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ని నొప్పి త‌గ్గ‌లేదు. అందువ‌ల్ల అత‌ను ఫీల్డింగ్‌కు రాలేక‌పోయాడు. దీంతో కోహ్లిని ఆర్‌సీబీ జ‌ట్టు మేనేజ్‌మెంట్ బ్యాట‌ర్‌గా ఉప‌యోగించుకోవాల‌నుకుంది. అందులో భాగంగానే కోహ్లిని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా నేరుగా బ్యాటింగ్‌లోనే బ‌రిలోకి దింపారు. అందువ‌ల్లే కోహ్లి అంత‌కు ముందు బెంగ‌ళూరు ఫీల్డింగ్‌లో మైదానంలో క‌నిపించ‌లేదు. ఈ విష‌యాల‌ను కోహ్లి మ్యాచ్ అనంతరం స్వ‌యంగా వెల్ల‌డించాడు. అయితే త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తోపాటు రానున్న ఐపీఎల్ మ్యాచ్‌ల‌పైనా అత‌ను ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

మ‌రింత తీవ్ర‌త‌రం కానున్న ఐపీఎల్ పోరు..

ఆర్‌సీబీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్‌ల‌లో తాను ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేద‌నే అనుకుంటున్నాన‌ని కోహ్లి తెలిపాడు. కానీ ల‌క్నోతో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల పూర్తి సంతృప్తిగా ఉన్న‌ట్లు తెలిపాడు. అయితే టీ20 క్రికెట్ ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంద‌ని, అందువ‌ల్ల ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేమ‌ని అన్నాడు. ఇక ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో పిచ్ స్లో గా ఉంద‌ని కోహ్లి అంగీక‌రించాడు. అందుక‌నే తాము టాస్ గెలిచిన అనంతరం ఫీల్డింగ్ తీసుకున్నామ‌ని, తాము ఊహించిన‌ట్లే పిచ్ స్లోగా ఉంద‌ని నిర్దార‌ణ అయింద‌ని, అయితే ల‌క్ష్యాన్ని ఛేదించాలంటే స‌రైన ఆరంభం ముఖ్యం క‌నుక‌, స్లో పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ప‌వ‌ర్ ప్లే లోనే అధిక ప‌రుగులు రాబ‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని వెల్ల‌డించాడు. తాము నిర్ణ‌యించుకున్న ప్లాన్‌ను 100 శాతం విజ‌య‌వంతంగా అమ‌లు చేశామ‌ని, దీంతో వికెట్లు కోల్పోయినా త‌రువాత వ‌చ్చిన బ్యాట‌ర్స్ స్వేచ్ఛ‌గా ఆడి ల‌క్ష్యాన్ని ఛేదించార‌ని తెలిపాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఇంకా ప్రారంభ ద‌శ‌లో ఉంద‌ని, ముందు ముందు పోరు మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంద‌ని, అందువ‌ల్ల త‌న బ్యాటింగ్‌ను ఇంకా మెరుగు ప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కోహ్లి పేర్కొన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM