వినోదం

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. Photo Credit: Netflix India/X.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా థియేట‌ర్ల‌లో మార్చి 19, 2026న రిలీజ్ కాగా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. ప్రారంభంలో ఓపెనింగ్స్ ఉన్నా త‌రువాత డీలా ప‌డి చివ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. అయితే నెల తిర‌గ‌కుండానే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఏప్రిల్ 16, 2026న స్ట్రీమ్ కానుంది. థియేట‌ర్ల‌లో ఈ సినిమాను చూడ‌లేక‌పోయిన వారు ఓటీటీలో చూడ‌వ‌చ్చు. భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు ప‌లు భాష‌లతోపాటు ఇంగ్లిష్‌లోనూ స‌బ్ టైటిల్స్‌ను అందివ్వ‌నున్నారు. దీంతో సినిమాకు రీచ్ ఎక్కువ ల‌భిస్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

ఓపెనింగ్స్ బాగున్నా..

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో భారీ హైప్‌ను సృష్టించింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ధురంధ‌ర్ 2తో పోటీ ప‌డుతుంద‌ని భావించారు. కానీ విడుదలైన నాలుగైదు రోజుల వ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌ను బాగానే సాధించినా త‌రువాత పూర్తిగా త‌గ్గిపోయాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆరంభంలో క‌లెక్ష‌న్ల‌ను సాధించినా త‌రువాత వెనుక‌బ‌డింది. దీంతో మేక‌ర్స్‌కు భారీగా న‌ష్టాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అయితే సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌, మాస్ అప్పీల్ ఈ సినిమాలో బాగున్న‌ప్ప‌టికీ, క‌థ‌, క‌థ‌నంపై ప్రేక్ష‌కులు పెద‌వి విరిచారు. థియేట్రిక‌ల్ ర‌న్ అనంత‌రం ఇప్పుడు ఈ మూవీ డిజిట‌ల్ వేదిక‌పై విడుద‌ల కానుంది.

వివ‌రాల‌ను వెల్ల‌డించిన నెట్ ఫ్లిక్స్‌..

ఏప్రిల్ 16, 2026 నుంచి త‌మ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంద‌ని నెట్ ఫ్లిక్స్ త‌మ సోష‌ల్ ఖాతాల ద్వారా ఈ విష‌యాన్ని వెల్లడించింది. సినిమాలోని ఓ ప్ర‌సిద్ధ డైలాగ్‌ను వినోదాత్మ‌కంగా ప్ర‌స్తావిస్తూ విడుద‌ల తేదీని వెల్ల‌డించారు. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం వంటి ప‌లు భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ఆయ‌న‌తో క‌లిసి గ‌తంలో ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేశారు. ఇప్పుడిది వీరి కాంబోలో రెండో సినిమా. గ‌బ్బ‌ర్ సింగ్ భారీ విజ‌యాన్ని సాధించినా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మాత్రం నిరాశ‌ప‌రిచింది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా న‌టులు శ్రీ‌లీల‌, రాశి ఖ‌న్నా యాక్ట్ చేయ‌గా, పార్థిబ‌న్‌, రావు ర‌మేష్‌, కేఎస్ ర‌వికుమార్ కీల‌కపాత్ర‌ల్లో న‌టించారు. వీకెండ్‌లో మంచి వినోదం కావాల‌ని చూస్తున్న వారు ఈ మూవీని ఒక‌సారి వీక్షించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM