వినోదం

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘డెకాయిట్’ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటున్న నిర్మాత సుప్రియ యార్లగడ్డ. Photo Credit: Supriya Yarlagadda/Instagram.

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు అంద‌రూ దాని గురించే మాట్లాడుకుంటున్నార‌ని అన్నారు. ఆమె నిర్మాణంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో తాజాగా వ‌చ్చిన చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో కొన‌సాగుతోంది. ఇందులో అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించారు. ఈ సినిమాను షానియ‌ల్ డియో తెర‌కెక్కించారు. అయితే సినిమా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతున్న నేప‌థ్యంలో ఆమె చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకున్నారు.

డెకాయిట్ ఒక మంచి ప్రేమ క‌థ‌..

మంచి సినిమాలు కావాలంటే క‌చ్చితంగా ఎల్ల‌ప్పుడూ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంద‌ని సుప్రియ అన్నారు. అదే వాటికి అందం తెస్తుంద‌ని, స్వ‌త‌హాగా త‌న‌కు ఎక్కువ‌గా డ్రామా టైప్ సినిమాలు, ప్రేమ క‌థ‌లు న‌చ్చుతాయ‌ని తెలిపారు. తెలుగులో ఈ క‌థ‌లు ఈ మ‌ధ్య ఎక్కువ రావ‌డం లేద‌ని త‌న‌కు అనిపిస్తుంద‌ని, అందుకే డెకాయిట్ రూపంలో మంచి ప్రేమ క‌థ‌ను అందించామ‌ని తెలిపారు. ఇది మ‌హిళ‌ల‌కు, జెన్‌జీకి కూడా క‌నెక్ట్ అయింద‌న్నారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ త‌న‌కు ఆనందాన్ని ఇస్తుంద‌ని, ఈ సినిమాను తాము జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కించామ‌ని తెలిపారు. వృథా ఖ‌ర్చులు అస‌లు చేయ‌లేద‌ని, 10, 15 రోజులు షెడ్యూల్ పెరిగినా కావాల‌నే తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కించామని తెలిపారు. ఇప్పుడు దీనికి హిందీలోనూ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్నారు. మ‌ల‌యాళంలో ప‌రిమిత థియేట‌ర్ల‌లో విడుద‌లైనా అక్క‌డా అంద‌రినీ ఈ సినిమా ఆక‌ట్టుకుంటుంద‌ని అన్నారు. ఇది ఓటీటీలో 5 భాష‌ల్లో విడుద‌ల‌వుతుంద‌ని తెలిపారు.

కొత్త వారితో ప‌నిచేయ‌డం స‌వాలే..

తాను ఈ సినిమా తీస్తున్నాన‌ని చెప్ప‌గానే చాలా మంది ఇలాంటి క‌థ ఎందుక‌ని ప్ర‌శ్నించార‌ని, రొటీన్‌గా అనిపించేవి చేయ‌వ‌చ్చు క‌దా అని స‌ల‌హా ఇచ్చార‌ని పేర్కొన్నారు. అలాంటివి తీయ‌డానికి చాలా మంది ఉన్నార‌ని, త‌న మార్క్ చూపించాలంటే డెకాయిట్ లాంటి చిత్రాల‌నే తీయాల‌ని, అందుక‌నే ఆ సినిమా తీశాన‌ని తెలిపారు. ఈ సినిమా కోసం కొత్త వారితో ప‌నిచేయ‌డం స‌వాల్ గా అనిపించింద‌ని, ఎడిట్ రూమ్‌లో అంతా కొత్త వారిని చూసిన‌ప్పుడు మొద‌ట్లో అనుకున్న స‌మయానికి సినిమాని అందించ‌గ‌ల‌మా, లేదా అని భ‌య‌ప‌డ్డాన‌ని, కానీ తాము అనుకున్న స‌మ‌యానికే చిత్రాన్ని పూర్తి చేశామ‌ని తెలిపారు. త‌న‌కు సినిమా అంటే ప్రేమ అని, త‌న ప్ర‌తి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం ఇష్ట‌మ‌ని, ప్రేమ‌, త్యాగం, ద్రోహం లాంటి ఎమోష‌న్స్ మ‌న క్లాసిక్ ప్రేమ క‌థ‌ల్లో ఉంటాయ‌ని అన్నారు. అలాంటి క‌థ‌లు క‌లిగిన సినిమాల‌ను తీయ‌డానికి తాను ఆస‌క్తిని చూపిస్తాన‌ని వెల్ల‌డించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM