తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు. తన తొలి సినిమా బద్రి మూవీ విశేషాలను ఆమె తాజాగా పంచుకున్నారు. ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించిన దుస్తులను తానే డిజైన్ చేస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు చెప్పానని, అందుకు ఆయన కూడా ఓకే చెప్పారని తెలిపారు. తాను నటించిన యాడ్స్ వల్లనే ఆ మూవీలో ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. తాను ఏ విషయంలో అయినా సరే సూటిగా మాట్లాడతానని, సినీ పరిశ్రమకు అది సెట్ కాదని, అందుకే మొదట్లో సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని, కానీ తరువాత తన నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు. ఇక బద్రి తరువాత తమిళంలో జేమ్స్ పాండు అనే సినిమాలో ఆఫర్ వచ్చిందని, ప్రభుదేవా మూవీ కావడంతో అందులో నటించేందుకు అడిగితే ఫోన్‌లోనే తన అంగీకారం తెలిపినట్లు వివరించారు. జానీ సిపిమాకు తాను ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశానని వెల్లడించారు. ఎవరూ సెలెక్ట్ అవకపోవడంతో ఆఖరి క్షణంలో తాను హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలిపారు.
కాగా రేణు దేశాయ్ ఇష్క్ వాలా లవ్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. రైతుల జీవితాలు, వారి సమస్యలపై త్వరలోనే ఓ సినిమా చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. 16 రోజుల పండుగ సినిమాతోపాటు మరో తెలుగు సినిమాలో, ఓ షార్ట్‌ఫిలింలో రేణు దేశాయ్ నటిస్తున్నారు. జానీ తరువాత 20 ఏళ్లకు టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కీలకపాత్రలో ఆమె నటించారు. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే డాక్టర్ కావాలన్నది తన కల అని, కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు.
ఇక రేణు దేశాయ్ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఆమె స్పందిస్తుంటారు. ఇటీవల వీధి కుక్కల పట్ల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆమె జంతు ప్రేమికులతో కలిసి గళమెత్తారు. వీధి కుక్కలను చంపకూడదని, వాటిని సంరక్షించాలని అన్నారు. అయితే ఈ విషయంపై ఆమె తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. దీంతో ఆమె ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. తాను వీధి కుక్కలను కాపాడాలని మాట్లాడానని, తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ట్రోల్ చేసినా సహించేది లేదని చెప్పారు. ఆ తరువాత ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిని అరెస్టు కూడా చేశారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…